తెలుగు రాష్ట్రాల వందేభారత్ ప్రయాణీకులకు బిగ్ అప్డేట్, ఇక..!!
తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ రైళ్లకు ఆదరణ పెరుగుతోంది. ప్రస్తుతం నడుస్తున్న వాటితో పాటుగా కొత్త రైళ్ల కోసం ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. వందేభారత్ స్లీపర్ ను ప్రవేశ పెడుతున్న వేళ తెలుగు రాష్ట్రాలకు కేటాయింపుల పైన రైల్వే శాఖ పైన ఒత్తిడి పెరుగుతోంది. ప్రస్తుతం విశాఖ నుంచి సికింద్రాబాద్ వందేభారత్ కోసం ప్రయాణీకుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి ఈ నిర్ణయం అమలు కానుంది.
తాజా నిర్ణయం
తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్ నుంచి విశాఖకు తొలి వందేభారత్ రైలు ప్రారంభమైంది. నాటి నుంచి నిత్యం ఈ రైలుకు డిమాండ్ కొనసాగుతోంది. తాజాగా ఈ రైలు సెలవులోనూ మార్పు చేసారు. ఇక, ఈ రైలుకు పెరుగుతున్న ఆక్యుపెన్సీతో రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకు న్నారు. దీంతో.. సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య ప్రయాణించే 16 బోగీల వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు అదనంగా నాలుగు బోగీలను జతచేసి శనివారం నుంచి 20 బోగీలతో నడపను న్నట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. సికింద్రాబాద్-విశాఖపట్నం - సికింద్రాబాద్ (20707 - 20708) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఇదివరకు 14 ఏసీ చైర్‌కార్, రెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌లు ఉండేవి.

నేటి నుంచి అమలు
ఈ రైలులో ఉన్న ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌లను యథాతథంగా ఉంచి ఏసీ చైర్‌కార్ కోచ్‌ల సంఖ్యను 18కి పెంచనున్నట్లు అధికారులు వెల్లడించారు. దీని ద్వారా ఈ రైలు కోసం నిత్యం కొనసాగు తున్న వెయిటింగ్ లిస్టు తగ్గించే ఛాన్స్ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇదే సమయం లో కొత్తగా వస్తున్న వందేభారత్ స్లీపర్ రైళ్ల కోసం డిమాండ్లు తెర పైకి వస్తున్నాయి. ఈ నెలలోనే రైల్వే శాఖ రూపొందించిన వందేభారత్ స్లీపర్లు పట్టాలెక్కనున్నాయి. తొలి ప్రాధాన్యత లో భాగంగా తెలుగు రాష్ట్రాలకు ఒకటి కేటాయించే అవకాశం ఉంది. దీంతో, విశాఖ నుంచి తిరుపతి కి కేటా యించేలా ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి. ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి తిరుపతికి రెగ్యులర్ వందేభారత్ నడుస్తోంది.
ఈ రైళ్లలోనూ పెంపు
ఇక, మరో నాలుగు ప్రధాన రైళ్లలోనూ ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా జనరల్ బోగీల సంఖ్య పెంచుతూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఇందులో ముంబాయి - బళ్లారి (11001/11002), ముంబాయి - చెన్నై సెంట్రల్ (22157/22158), మైసూరు - నూఫిగేంట (22135/22136), కొల్లాపూర్ - నాగపూర్ (11403/11404) రైళ్లు ఉన్నాయి. ఈ రైళ్లల్లో పెరిగిన కోచ్ లు సెప్టెంబర్ 5వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం వీటిల్లో మూడు జనరల్ బోగీలు మాత్రమే ఉండటంతో.. పెంపు నిర్ణయం తీసుకున్నారు.












Click it and Unblock the Notifications