ALERT: ఆ రైళ్లు ఇకపై సికింద్రాబాద్‌ రావు.. ఇతర స్టేషన్లకు మళ్లింపు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకంలో భాగంగా.. దక్షిణ మధ్య రైల్వే ప్రధాన స్టేషన్ అయిన సికింద్రాబాద్ స్టేషన్ లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే బోర్డు కీలక ప్రకటన చేసింది. నిత్యం సికింద్రాబాద్ స్టేషన్ కు వచ్చే దాదాపు 10 రైళ్ల గమ్యస్థానాలను తాత్కాలికంగా మార్చుతున్నట్లు పేర్కొంది.

కాచిగూడ, ఉమ్దానగర్, మల్కాజ్ గిరి, హైదరాబాద్ (నాంపల్లి) స్టేషన్లకు రైళ్లు మళ్లించినట్లు తెలిపింది. ఈ మేరకు ప్రయాణికులు తమ రైలు సమయాన్ని ధృవీకరించుకోవాలని ఓ ప్రకటనలో పేర్కొంది. అభివృద్ధి పనుల కారణంగా ఈ మార్పులు చేసినట్లు తెలిపింది.

విజయవాడ-సికింద్రాబాద్ (12713/12714) - శాతవా హన ఎక్స్ ప్రెస్ విజయవాడలో బయల్దేరి కాచిగూడ స్టేషన్‌కు చేరుతుంది. అక్కడి నుంచి తిరిగి విజయవాడ బయల్దేరుతుంది. ఉదయం 6.25కు విజయవాడలో బయల్దేరి 12.55కు కాచిగూడ చేరుతుంది. కాచిగూడలో సాయంత్రం 4 గంటలకు బయల్దేరి రాత్రి 10.15కు విజయవాడ చేరుతుంది.

సికింద్రాబాద్- రేపల్లె (17645/17646) సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌, సిల్చార్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌ (12514/12513), సికింద్రాబాద్- దర్బంగా (17007/17008) సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌ చర్లపల్లి నుంచి బయల్దేరుతాయి.

Railway Upgrades at Secunderabad 10 Train Destinations Changed

సిద్దిపేట- సికింద్రాబాద్ - (77656/77653), (77654/77655) డెమూ రైళ్లు మల్కాజిగిరి వరకు వెళ్తాయి.

సికింద్రాబాద్- మణుగూరు (12745/12746) సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌ చర్లపల్లి నుంచి బయల్దేరుతుంది. తిరిగి చర్లపల్లి చేరుతుంది.

పుణే-సికింద్రాబాద్ (12025/12026) పుణే ఎక్స్ ప్రెస్‌ బోర్డింగ్‌ , తిరుగు ప్రయాణం గమ్యస్థానం హైదరాబాద్ స్టేషన్‌కు మార్చారు. తిరుగు ప్రయాణంలో గమ్యస్థానం హైదరాబాద్‌ వరకు ఉంటుంది.

పోరుబందర్-సికింద్రాబాద్ (20968/20967) పోరు బందర్ ఎక్స్‌ప్రెస్‌ పోరుబందర్ నుంచి కాచిగూడ మీదుగా ఉమ్దానగర్ వరకు వెళుతుంది.

సికింద్రాబాద్- యశ్వంత్‌పుర (12735/12736) సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్ చర్లపల్లి టెర్మినల్ నుంచి బయల్దేరుతుంది. సికింద్రాబాద్ స్టేషన్ మీదుగా యశ్వంత్‌పుర వెళుతుంది.

ప్రయాణికులు ఈ మార్పులను గమనించి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక ప్రకటన చేశారు. సికింద్రాబాద్‌ స్టేషన్‌లో పనులు పూర్తయిన వెంటనే రైళ్ల రాకపోకల్ని పునరిద్ధరిస్తామని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+