తిరుమల, చెన్నై, బెంగళూరు ప్రయాణీకులకు కేంద్రం గుడ్ న్యూస్- కష్టాలకు చెక్, కొత్తగా..!!

కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలకు వచ్చే భక్తులతో పాటుగా చెన్నై, బెంగళూరుకు వెళ్లే ప్రయాణీకులకు తీపి కబురు చెప్పింది. ఇప్పటి వరకు ఈ మార్గంలో ప్రయాణ సమయంలో తరచూ ఎదురవుతున్న సమస్యలకు చెక్ పడనుంది. ఈ మేరకు రైల్వే శాఖ తాజాగా గెజిట్ జారీ చేసింది. దీంతో.. ఇక ఈ మార్గంలో ప్రయాణం మరింత సులభతరం కానుంది. ప్రయాణీకులకు ప్రయోజనం కలగనుందని అధికారులు వెల్లడించారు.

తిరుమలతో సహా చెన్నై, బెంగళూరు వెళ్లే ప్రయాణీకుల కోసం కేంద్రం తీసుకున్న నిర్ణయం కార్య రూపం దాల్చుతోంది. ఈ మేరకు రైల్వే అధికారులు గెజిట్ జారీ చేసారు. తిరుపతికి వచ్చే భక్తుల తో పాటుగా ఈ జిల్లా మీదుగా రాకపోకలు సాగించే వారి కోసం కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. గూడూరు- రేణిగుంట స్టేషన్ల మధ్య 83.17 కిలోమీటర్ల మేర నిర్మించ తలపెట్టిన మూడో రైల్వే లైన్‌ నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ తుది దశకు చేరింది. రైల్వే చట్టం 1989లోని సెక్షన్‌ 20 ఈ కింద భూసేకరణను ఖరారు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తరఫున దక్షిణ తీర రైల్వే గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రచురించింది. దీనికి కేంద్రం ప్రత్యేక రైల్వే ప్రాజెక్టుగా పేర్కొంది. ఈ మార్గంలో నిత్యం పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. రవాణా రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో.. ఈ మార్గానికి ప్రాధాన్యత ఇస్తూ త్వరగా ప్రాజెక్టు పూర్తి చేయాలని భావిస్తోంది.

భారీగా కొత్త పెన్షన్ల మంజూరు, తొలుత వీరికే- దరఖాస్తులు.. పంపిణీ ముహూర్తం..!!
భారీగా కొత్త పెన్షన్ల మంజూరు, తొలుత వీరికే- దరఖాస్తులు.. పంపిణీ ముహూర్తం..!!
railways-begin-land-acquisition-for-guduru-renigunta-third-line-expansion-as-central-decision-det

రైల్వే శాఖ తాజా నిర్ణయంతో

కాగా, ఇప్పటికే సెక్షన్‌ 20ఏ కింద భూసేకరణ ఉద్దేశాన్ని ప్రకటిస్తూ ఇచ్చిన నోటిఫికేషన్‌పై చట్టబద్ధమైన గడువు ముగిసేవరకు ఎలాంటి అభ్యంతరాలు రాలేదు. ఈమేరకు అధికార యంత్రాంగం నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నోటిఫికేషన్‌ను ఖరారు చేసింది. దీంతో భూసేకరణ అడ్డంకులు తొలగి పనులు మరింత వేగవంతం కానున్నాయి. కాగా, గూడూరు-రేణిగుంట మార్గం దక్షిణాదిన అత్యంత కీలకమైన, రద్దీతో ఉండే రైలు మార్గం. ఈ మూడో లైన్‌ అందుబాటులోకి వస్తే శ్రీవారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులతోపాటు, చెన్నై, విజయవాడ, బెంగళూరు మార్గాల్లో ప్రయాణించే వేలాది మందికి అధిక సమయం ఆదా అవుతుంది. రైళ్ల రాకపోకల వేగం పెరగడమే కాకుండా, ఈ ప్రాంతంలో సరుకు రవాణాకు అవకాశం ఏర్పడుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+