విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!
రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు చేసింది. కొంత కాలంగా వస్తున్న డిమాండ్ కు అనుగుణంగా నిర్ణయం వెల్లడించింది. పలాస- ఇచ్చాపురం సెక్షన్ విశాఖ ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న దక్షిణా కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి తీసుకొస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మార్గం వాణిజ్య పరంగా కీలకంగా ఉంది. ఇప్పుడు తాజా నిర్ణయంతో ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల డిమాండ్ నెరవేరింది. ఈ నిర్ణయం ద్వారా ఏడు స్టేషన్లు విశాఖ జోన్ పరిధిలోకి రానున్నాయి.
విశాఖ కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలో కొత్త మార్పులు జరిగాయి. తాజాగా రైల్వే శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పలాస- ఇచ్చాపురం సెక్షన్ విశాఖ జోన్ పరిధిలోకి తీసుకొస్తూ రైల్వేశాఖ ఆదేశాలు జారీ చేసింది. కొత్త జోన్ ఏర్పాటు అయినా ఈ సెక్షన్ పరిధిలోని ప్రయాణీకుల రాకపోకలు ఈస్టోకోస్ట్ రైల్వే జోన్‌పై ఆధారపడాల్సి ఉంటుందని తెలిసి అంతా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు రెండు జోన్‌లలో ఉండటం వల్ల రవాణా పరంగా చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఇప్పటికే ఒడిశాకు ఆనుకొని ఉన్న కొన్ని ప్రాంతాలు పడుతున్న ఇబ్బందులు తెలిసిన ఇక్కడి రాజకీయ నాయకులు కూడా విశాఖ జోన్‌లో పలాస- ఇచ్చాపురం సెక్షన్‌ను కలపాలని డిమాండ్ చేశారు. దీంతో.. పలాస-ఇచ్చాపురం సెక్షన్‌ను విశాఖ జోన్‌లో భాగం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

చిరకాల డిమాండ్ మేరకు తాజా నిర్ణయం
దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను విశాఖ కేంద్రం నాలుగు డివిజన్లతో ఏర్పాటు చేశారు. అవి విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, విశాఖ డివిజన్. ఇప్పటి వరకు ఖుర్దా డివిజన్‌లో ఉన్‌న పలాస- ఇచ్చాపురం సెక్షన్‌ను ఇకపై విశాఖపట్నం డివిజన్‌లో భాగం అయ్యాయి. ఈ నిర్ణయం 7 రైల్వేస్టేషన్లు ఇక నుంచి విశాఖ పరిధిలోకి రానున్నాయి. ఇక.. ఎప్పటి నుంచో ఉన్న వాల్తేరు డివిజన్‌ను రెండుగా విభజించారు. ఒక భాగాన్ని విశాఖపట్నం డివిజన్‌గా చేశారు. మరో భాగాన్ని ఒడిశాలోని రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ చేశారు. ఈ రాయగడ కేంద్రాన్ని ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్‌లోనే ఉంచారు. వాల్తేరు డివిజన్ బ్రిటిష్ కాలం నాటిది కాబట్టి దానికి విశాఖ డివిజన్ అని పేరు పెట్టారు.దీనిపై స్పందించిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కేంద్రానికి కృతజ్ఞతలు చెప్పారు. ఈ నిర్ణయం ద్వారా "ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ ఖుర్దా డివిజన్ పరిధిలోని ఇచ్చాపురం నుంచి పలాస వరకు ఉన్న 7 రైల్వే స్టేషన్లు విశాఖపట్నం కేంద్రంగా ఏర్పడిన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కు బదిలీ చేస్తూ రైల్వే బోర్డు ఉత్తర్వులు విడుదల చేయడం ఆనందంగా ఉందని వెల్లడించారు.
-
IRCTC స్పెషల్ ఆఫర్ - అరకు, విశాఖ టూర్ స్పెషల్.. ప్యాకేజీ ఇలా..!! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..!













Click it and Unblock the Notifications