పేదల రైళ్లు వచ్చేస్తున్నాయ్ - రైల్వే శాఖ నిర్ణయం ,ఇవీ ప్రత్యేకతలు..!!
వందేభారత్ రైళ్లకు ప్రాధాన్యత పెరుగుతున్న వేళ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి పేదల కోసం నాన్ ఏసీ సాధారణ రైళ్లను నడపాలని రైల్వే బోర్డు సూత్రప్రాయంగా నిర్ణయించింది. వచ్చే ఏడాది జనవరి నుంచి దశల వారీగా అమల్లోకి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఈ రైళ్లల్లో ఏసీ లేని స్లీపర్ కోచ్ లుగా ఈ రైళ్లు కొనసాగనున్నాయి. అన్ని జనరల్ బోగీలుగానే ఈ రైళ్లను అందుబాటు లోకి తీసుకురానున్నారు.
నాన్ ఏసీ కోచ్ లతో సిద్దం:వచ్చే జనవరి నుంచి పేదల రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. పేదల కోనం నాన్ ఏసీ సాధారణ రైళ్లను నడపాలని రైల్వే బోర్డు ప్రణాళికలతో సిద్దమైంది. వలస కార్మికులు, కూలీల కోసం వీటిని క్రమం తప్పకుండా నడపాలనుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.

సాధారణంగా ఇటువంటి రైళ్లను పండగుల సీజన్..వేసవి రద్దీ సందర్భాల్లో రైల్వే శాఖ ఏర్పాటు చేస్తుంది. కానీ, ఇక నుంచి ఏడాది పొడువునా వీటిని నడపాలని రైల్వే బోర్డు భావిస్తోంది. స్వల్ప ఆదాయం ఉన్న ప్రజలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి అత్యధిక ప్రయాణాలు నమోదువుతన్నాయని రైల్వే శాఖ తాజాగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
వందేభారత్ పై విమర్శల వేళ:ఈ రైళ్లల్లో జనరల్ ,స్లీపర్ కోచ్ లే ఉంటాయి. ఏసీ ఉండదు. ఈ రైళ్లను ఉత్తర ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, చత్తీస్ ఘడ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, పంజాబ్, అస్సాం, గుజరాత్, ఢిల్లీ తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో నడపాలని భావిస్తున్నారు. ఈ రైళ్లల్లో 22 నుంచి 26 బోగీలు ఉంటాయి.
ఇవి సాధారణ రైళ్లలాగా నడుస్తాయని..ముందస్తు రిజర్వేషన్లు అనుమతిస్తామని రైల్వే అధికారులు స్పష్టం చేసారు. భవిష్యత్ లో రైళ్లలో ఎల్ హెచ్ బీ, వందేభారత్ బోగీలే ఉంటాయని అధికారులు స్పష్టం చేసారు. ప్రస్తుతం రైల్వేలో 28 రకాల బోగీలున్నాయి. వందేభారత్ కు ప్రాధాన్యత ఇస్తున్నారని..ఆ ధరలు సామాన్యులు భరించలేరని వస్తున్న విమర్శలతో ప్రత్యేకంగా పేదల రైళ్ల పైన రైల్వే శాఖ ఫోకస్ చేసింది.

రద్దీ ఉన్న ప్రాంతాల్లో ప్రాధాన్యత:ప్రస్తుతం నడుస్తున్న పలు సాధారణ ఎక్స్ ప్రెస్ రైళ్ల కంటే వందేభారత్ కు ప్రాధాన్యత పెరుగుతోంది. కేంద్రం ఆదేశాల మేరకు వందేభారత్ ను మరిన్ని రూట్లలో అందుబాటులోకి తెచ్చేందుకు రైల్వే శాఖ ప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో కొన్ని మినహా దాదాపు అన్ని వందేభారత్ రైళ్లకు ఆదరణ కనిపిస్తోంది.
ఈ సమయంలో పేదల కోసం ప్రత్యేక రైళ్ల ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. రైల్వే నిర్వహించిన సర్వే మేరకు డిమాండ్ ఉన్న రూట్లలో ముందుగా ప్రారంభించి..విడతల వారీగా విస్తరించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. వచ్చే జనవరి నుంచి ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలనేది రైల్వే అధికారుల ప్రయత్నం. దీంతో, ఈ రైళ్లకు ఆదరణ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
-
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..!












Click it and Unblock the Notifications