రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్- అదనపు ఛార్జీలు బంద్ : అవి మాత్రం కంటిన్యూ..!!

రైల్వే ప్రయాణీకులకు ఆ శాఖ రిలీఫ్ ఇచ్చింది. కరోనా ప్రారంభమైన సమయం నుంచి ప్రయాణీకుల నుంచి ప్రత్యేక రైళ్ల పేరుతో వసూలు చేస్తున్న ప్రత్యేక ఛార్జీలు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని జోనల్ కార్యాలయాలకు రైల్వే ఆదేశాలు ఇచ్చింది. కరోనా ప్రారంభమైన తరువాత సుదీర్ఘ కాలం రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఇక, ఆ తరువాత క్రమేణా ప్రారంభమైనా...కరోనా ఆంక్షల పేరుతో కొన్ని సర్వీసులు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. దీంతో..వాటి నిర్వహణకు అయ్యే ఖర్చు కారణంగా ప్రత్యేక రైళ్లు అనే పేరుతో..అదనపు ఛార్జీలు వసూలు చేసారు.

ప్రయాణీకులకు ఛార్జీల రిలీఫ్

ప్రయాణీకులకు ఛార్జీల రిలీఫ్

కరోనా దాదాపుగా పూర్తిగా తగ్గిపోవటంతో రైల్వేలో ప్రయాణీకుల సంఖ్య సైతం గణనీయంగా పెరిగింది. ఇక, ఇంత కాలం రైళ్లలో అదనపు ఛార్జీలు వసూలు చేయటం పైన ప్రయాణీకుల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతోంది. దీంతో..రైల్వే శాఖ దీని పైన తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రత్యేక రైళ్లు పేరుతో సాధారణ సర్వీసులు ఉండవని స్పష్టం చేసింది. కరోనాకు ముందున్న విధంగానే రైళ్ల పేర్లు, వాటి ఛార్జీలు ఉండనున్నాయి. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి.

కరోనా సమయం నుంచి ప్రత్యేక ఛార్జీల వసూలు

కరోనా సమయం నుంచి ప్రత్యేక ఛార్జీల వసూలు

కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ దగ్గర నుంచి రైల్వే శాఖ కేవలం 'స్పెషల్‌ ట్రైన్స్‌'ను మాత్రమే నడుపుతోంది. అనవసర ప్రయాణాలను నిరుత్సాహ పరచాలన్న ఉద్దేశంతో ఛార్జీలను పెంచింది కూడా. తొలుత దూర ప్రాంతాల మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడిపి, అనంతరం తక్కువ దూరం మధ్య కూడా నడపడాన్ని ప్రారంభించింది. పాతవాటినే ప్రత్యేక రైళ్లుగా నడుపుతూ అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కరోనా ముందున్న విధంగానే రైళ్ల పేర్లు, నెంబర్లు, ఛార్జీలు అమలు చేయాలని పేర్కొంటూ రైల్వే బోర్డు అన్ని జోనల్‌ కార్యాలయాలకు లేఖలు రాసింది.

Recommended Video

    Mohammad Rizwan The Real Warrior | T20 World Cup 2021 || Oneindia Telugu
    యధావిధిగా అవే రైళ్లు..అవే ఛార్జీలు

    యధావిధిగా అవే రైళ్లు..అవే ఛార్జీలు

    అన్ని రైళ్లు పట్టాలు ఎక్కడానికి ఒకటి రెండు రోజులు పడుతుందని సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. ప్రత్యేక రైలు నెంబరుకు మొదట 'సున్నా' ఉంటుందని, ఇకపై అది ఉండబోదని తెలిపారు. అయితే కరోనా కారణంగా రాయితీలు, బెడ్‌ రోల్స్‌, భోజనాలపై విధించిన తాత్కాలిక ఆంక్షలు ప్రస్తుతానికి కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేసారు. కరోనా పేరుతో పలు రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫాం ధరలను పెంచేసారు.

    పది రూపాయాల ధరను రూ 50, రూ 100 వరకు కొన్ని ప్రాంతాల్లో వసూలు చేసారు. ఇక, ఇప్పుడు గతంలో మాదిరిగానే తిరిగి అన్ని రకాల రైళ్లు..సేవలతో పాటుగా పాత ధరలే వర్తిస్తాయని అధికారులు క్లారిటీ ఇచ్చారు. దీంతో..అయితే, ఇప్పటికే రిజర్వేషన్ చేయించుకున్న వారికి మాత్రం వారు చెల్లించిన ధరలే వర్తిస్తాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+