పల్నాడు, జన్మభూమి, సింహాద్రి ఎక్స్ ప్రెస్ ల ప్రయాణీకులకు బిగ్ అలర్ట్, కీలక మార్పు- ఇక నుంచి..!!
రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రెగ్యులర్ ఎక్స్ ప్రెస్ రైళ్ల ప్రయాణీకుల కోసం కొత్త సౌకర్యం కల్పించింది. రద్దీ వేళల్లో రిజర్వేషన్ దక్కని ప్రయాణీకులకు వెసులుబాటు కలిగించేలా తాజా నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల క్రితం రైల్వే రిజర్వేషన్ ఛార్ట్ వేళల్లో మార్పులు చేసిన రైల్వే శాఖ.. ఇప్పుడు ఈ ప్రధాన ఎక్సె ప్రెస్ లో ప్రయాణీకులకు అందుబాటులో ఉండే విధంగా కొత్తగా కరెంట్ బుకింగ్ సౌకర్యం పైన నిర్ణయం తీసుకుంది. దీంతో పాటుగా ఈ రైళ్లల్లో తత్కాల్ కోటాను సవరించినట్లు అధికారులు వెల్లడించారు.
రైల్వే శాఖ తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణించే పలు ప్రధాన ఎక్స్ ప్రెస్ రైళ్లకు సంబంధించి కీలక అప్డేట్ అందింది. ఈ రైళ్లకు కరెంట్ బుకింగ్ సౌకర్యాన్ని రైల్వే అందుబాటులోకి తీసుకొచ్చింది. 12747 గుంటూరు - వికారాబాద్ పల్నాడు ఎక్స్ ప్రెస్ కు నడికూడి, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్, బేగంపేట, సనత్ నగర్, లింగపల్లిలో కరెంట్ బుకింగ్ సౌకర్యాన్ని ఏప్రిల్ 2 నుంచి అమలు చేయనుంది. అదే విధంగా 12748 వికారాబాద్ - గుంటూరు పల్నాడు ఎక్స్ ప్రెస్ కు సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, నడికూడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లిలో కరెంట్ బుకింగ్ అమలు చేసేందుకు నిర్ణయించింది. అదే విధంగా తల్కాల్, ప్రీమియం తత్కాల్ కోటాలను కూడా సవరించింది. కాగా, సింహాద్రి..జన్మభూమి..గోల్కొండ.. వయా వరంగల్ ఇంటర్ సిటీ, ఛత్రపతి శంభాజీ నగర్ - గుంటూరు ఎక్స్ ప్రెస్ రైళ్లకు ఇదే విధంగా కరెంట్ రిజర్వేషన్ అందుబాటులోకి తీసుకొస్తూ నిర్ణయం తీసుకున్నారు.

తత్కాల్ కేటాయింపులోనూ సవరణలు
ఈ తాజా నిర్ణయం ద్వారా ఈ రైళ్లు బయలు దేరటానికి గంట మందు కూడా మిగిలిపోయిన టికెట్ లు బుకింగ్ లోకి వస్తాయని వెల్లడించారు. అదే విధంగా ఇప్పుడు IRCTC 'కరెంట్ టికెట్ సిస్టమ్' పేరుతో రైలు కొద్ది మంది ప్రయాణీకులు అనివార్య కారణాలతో చివరి నిమిషంలో టికెట్ క్యాన్సిల్ చేసుకుంటారు. కాగా, రిజర్వేషన్ ఛార్ట్ పైన రైల్వే శాఖ తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రయాణీకు లకు ప్రయోజన కరంగా మారింది. ఈ కొత్త సౌకర్యం ప్రకారం ప్రయాణికులు రైలు ప్రయాణ సమయానికి నాలుగు గంటల ముందు నుంచి ఆఖరి చార్ట్ (సాధారణంగా ఇది రైలు బయలు దేరడానికి 30 నిమిషాల ముందు ఉంటుంది) తయారు చేసే వరకు రిజర్వేషన్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ కరెంట్ బుకింగ్ టికెట్లను ఆన్‌లైన్‌లో, ఆయా స్టేషన్లలోని కరెంట్ రిజర్వేషన్ కౌంటర్లలో తీసుకోవచ్చు. ఈ టికెట్లకు సాధారణ చార్జీలే తప్ప ఎలాంటి అదనపు రుసుం తీసుకోరు. ఏసీ, స్లీపర్ సహా అన్ని తరగతులకు ఈ సౌకర్యం వర్తిస్తుంది.
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!!











Click it and Unblock the Notifications