తిరుపతికి వందేభారత్ స్లీపర్- రూట్, టికెట్ ధరలు.. ముహూర్తం..!!
రైల్వే శాఖ తెలుగు రాష్ట్రాల ప్రయాణీకుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. వందేభారత్ స్లీపర్ ను తాజాగా ప్రధాని మోదీ ప్రారంభించారు. గౌహతి- అస్సాం మధ్య తొలి సర్వీసు అందుబాటులోకి వచ్చింది. విమాన తరహా సౌకర్యాల తరహాలో ఉన్న ఈ రైలు పైన ప్రయాణీకుల్లో ఆసక్తి నెలకొంది. కాగా, తెలుగు ప్రయాణీకుల కోసం తొలి విడత వందేభారత్ స్లీపర్ కేటాయింపుల్లో తిరుపతికి కొత్త సర్వీసుకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. అదే విధంగా సికింద్రాబాద్ నుంచి కొత్త ప్రతిపాదన పైన కసరత్తు జరుగుతోంది.
వందేభారత్ స్లీపర్ రైళ్లు వరుసగా పట్టాలెక్కుతున్నాయి. తొలి రైలును ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. తొలి విడతలో తొమ్మిది రైళ్లు పలు రాష్ట్రాలకు కేటాయింపు పైన తుది కసరత్తు జరుగుతోంది. అందులో భాగంగా తిరుపతికి ఒక రైలు కేటాయించాలని నిర్ణయించారు. సికిందర్ రాబాద్ నుంచి ఢిల్లీ, విజయవాడ నుంచి అయోధ్య, విశాఖ నుంచి తిరుపతికి వందేభారత్ స్లీపర్ రైళ్ల కేటాయింపు పైన ప్రతిపాదనలు సిద్దంగా ఉన్నాయి. వీటిల్లో ముందుగా విశాఖ నుంచి బెంగళూరుకు వయా తిరుపతి మీదుగా వందేభారత్ కేటాయింపు కు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందేభారత్ ఉదయం సమయంలో రాకపోకలు సాగిస్తోంది. ఈ రైలుకు భారీగా డిమాండ్ ఉంటోంది. వందేభారత్ స్లీపర్ రైళ్ల కేటాయింపు పైన తెలుగు రాష్ట్రాల ఎంపీల నుంచి రైల్వే శాఖకు పలు ప్రతిపాదనలు అందాయి. అందులో భాగంగా విశాఖ నుంచి తిరుపతి, విశాఖ నుంచి బెంగళూరు కు వందేభారత్ స్లీపర్ కేటాయించాలని ఇప్పటికే ఎంపీలు నేరుగా రైల్వే మంత్రిని కలిసి వితని పత్రాలు సమర్పించారు.
ఇక, విజయవాడ నుంచి బెంగళూరుకు తిరుపతి మీదుగా వందేభారత్ కు ఆమోదం వచ్చినా ఇంకా పట్టాలెక్కలేదు. ఇదే సమయంలో ఏపీ నుంచి అయోధ్య, వారణాసి కి వందేభారత్ స్లీపర్ కేటా యింపు లో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని రైల్వే మంత్రిని ఏపీకి చెందిన కీలక నేతలు కోరారు. ఇందు కు తాజాగా రైల్వే శాఖ నుంచి సానుకూల స్పందన వచ్చింది. దీంతో..ఏపీ నుంచి రెగ్యులర్ రైళ్లల్లో అయోధ్య, వారణాసి వెళ్లే వారికి ప్రయోజన కరంగా ఉండనుంది. తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో భాగంగా విజయవాడ టు అయోధ్య ప్రతిపాదన పైన తొలుత చర్చ జరిగింది.
కానీ, తాజాగా సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ, అదే విధంగా విశాఖ నుంచి బెంగళూరుకు వయా తిరుపతి మీదుగా వందేభారత్ స్లీపర్ రైలు ఖాయమైనట్లు సమాచారం. ఈ నెల 26న ఈ రైలును అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. ఈ రైలులో కనీస ఛార్జి రూ.960 నుంచి ప్రారంభ ధరగా నిర్ణయించారు. ది. 400 కిలోమీటర్ల ప్రయాణానికి 3ఏసీ ప్రయాణానికి ఈ ఛార్జీ వర్తిస్తుంది. ఈ రైళ్లల్లో RAC సౌకర్యం ఉండదని అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికుల కేవలం కన్ఫర్మ్ టికెట్లు మాత్రమే జారీ చేస్తారు. రైల్వే శాఖ ఈ రైలును అధికారికంగా ప్రకటిస్తే.. తిరుపతికి వెళ్లే ప్రయాణీకులకు వెసులుబాటు కలగనుంది.
-
Trains: నరసాపురం, తిరుపతి, చర్లపల్లి ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..!












Click it and Unblock the Notifications