రైల్వే ప్రయాణీకులకు బిగ్ అప్డేట్ - డోన్ట్ మిస్..!!
రైల్వే ప్రయాణీకులకు కీలకమైన సమచారాం అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. రైల్వే శాఖ కొత్త డిపార్చర్, అరైవల్ సమయాలతో సహా అందిస్తున్న సౌకర్యాలను ప్రయాణీకుల ముందకు తీసుకొచ్చింది. ఇందుకోసం రైల్వే మంత్రిత్వ శాఖ మంగళవారం ట్రైన్స్ ఎట్ ఎ గ్లాన్స్ గా కొత్త ఆల్ ఇండియా రైల్వే టైమ్ టేబుల్‌ని విడుదల చేసింది. ఈ కొత్త టైం టేబుల్ 1 అక్టోబర్, 2023 నుండి అమలులోకి తెచ్చింది. కొత్త అంశాలను ఇందులో చేర్చింది.
కొత్త టైం టేబుల్
దేశ వ్యాప్తంగా రైల్వే అందిస్తున్న సేవలు..రైళ్ల వివరాలతో కొత్త టైం టేబుల్ ను రైల్వే శాఖ విడుదల చేసింది. ప్రయాణికులు కొత్త డిపార్చర్, అరైవల్ సమయాలను చెక్ చేసుకోవాలని సూచించింది. 90 రైళ్ల సర్వీసుల గమ్యస్థానాలను పెంచగా, 22 రైళ్ల వేగాన్ని పెంచి సూపర్‌ఫాస్ట్ క్యాటగిరీలోకి మార్చారు. ప్రయాణీకులు కొత్త టైమ్‌టేబుల్ ప్రకారం బయలుదేరే, రాక సమయాల్లో మార్పులను సరి చూసుకోవాలని కొత్త ఆల్ ఇండియా రైల్వే టైమ్‌టేబుల్‌ను జారీ చేస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్త టైమ్‌టేబుల్‌లో ప్రయాణికులకు సౌకర్యవంతమైన, సమర్థవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి 64 వందే భారత్ రైళ్లు ఇతర 70 రైలు సర్వీసుల సేవలను అందులో పొందుపర్చినట్లు వెల్లడించింది.

మార్పులు..చేర్పులు
వివిధ నగరాల మధ్య అనుసంధానాన్ని పెంచి..ప్రయాణ సమయాన్ని తగ్గించేలా ఈ సమయ పట్టికను రూపొందించారు. 90 రైళ్ల సేవలను ఇతర గమ్యస్థానాలకు విస్తరించింది మరియు 12 రైళ్ల సర్వీసుల ఫ్రీక్వెన్సీని పెంచింది. 22 రైళ్లను సూపర్ ఫాస్ట్ కేటగిరీ రైళ్లుగా మార్చడం ద్వారా వాటి వేగాన్ని పెంచారు.అగర్తలా-ఆనంద్ విహార్ రాజధాని (20501/02) మాల్దా మరియు భాగల్పూర్ మీదుగా మళ్లించబడిందని భారతీయ రైల్వే తెలిపింది.కొత్త టైమ్‌టేబుల్‌లో సౌత్ ఈస్టర్న్ రైల్వేలోని కొన్ని రైలు సర్వీసులు సమయాల్లోనూ మార్పులు చేసారు. కొత్త టైమ్ టేబుల్ మీకు ప్రధాన స్టేషన్‌లలోని రైళ్ల బయలు దేరిన మరియు చేరుకునే సమయాలు, వాటి సర్వీస్ క్లాస్‌ల వసతి, కిలోమీటర్ల దూరం మరియు ప్యాంట్రీ కార్ల లభ్యత వంటి వివరాలను అందిస్తుంది.
వందేభారత్ కోసం
పలు రైళ్లను సూపర్ ఫాస్ట్ లుగా నడపనుండటం వలన రాకపోకాల సమయాల్లో మార్పులు చేసారు. ప్రయాణీకులు ముందుగా సరి చూసుకోవాలని రైల్వే శాఖ సూచించింది. రైల్వే అధికారిక వెబ్ సైట్ లోనూ పూర్తి సమాచారం అందుబాటులోకి తెచ్చారు. తాజాగా చేసిన మార్పులను గమినిస్తే వందేభారత్ కు ప్రాధాన్యత ఇచ్చే విధంగా అవి ప్రయాణించే మార్గాల్లో ఇతర రైళ్ల వేళల్లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో పలు రైళ్లను రోజుల తరబడి రద్దు చేయటం వెనుక వందేభారత్ కు ప్రాధాన్యతే కారణమని స్ఫష్టం అవుతోంది.












Click it and Unblock the Notifications