విజయనగరం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నేనిచ్చిన డబ్బుకు మీ డబ్బు కలిపి బ్రహ్మండంగా ఇళ్లు...ఇంకా ఏం కావాలి:చంద్రబాబు

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

విజయనగరం: విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుగా ఎస్‌. కోట గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.
గ్రామస్థులు తానిచ్చిన డబ్బుకు రెండు, మూడు లక్షలు అదనంగా వేసుకుని బ్రహ్మాండంగా ఇళ్లు కట్టుకున్నారని, అందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.

Recommended Video

మోడీకి టీడీపీ అంటే భయం: చంద్రబాబు

ఇంకా ఈ గ్రామానికి ఏం కావాలో చెబితే అధికారులు తన దృష్టికి తీసుకువస్తారని, తక్షణమే చర్యలు తీసుకుంటామని చంద్రబాబు గ్రామస్తులకు హామీ ఇచ్చారు. సిఎం పర్యటన సందర్భంగా ఎస్.కోటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు భారీ వర్షం దెబ్బ ఎదురవడంతో ఏర్పాట్లన్నీ చెల్లాచెదురయ్యాయి.భారీ ఈదురు గాలులు, భారీ వర్షం ధాటికి సభా ప్రాంగణం దగ్గర టెంట్లన్నీ కుప్పకూలాయి. మరోవైపు భధ్రతా బలగాలు సీఎం చంద్రబాబుకు రక్షణ వలయంగా నిలిచాయి.

జిల్లాలో...సిఎం చంద్రబాబు పర్యటన

జిల్లాలో...సిఎం చంద్రబాబు పర్యటన

సిఎం చంద్రబాబు విజయనగరం జిల్లా పర్యటన తొలి అర్ధ భాగం బిజీబిజీగా సాగింది. తొలుత సిఎం లక్కవరపుకోట మండలం జమ్మాదేవిపేట గ్రామం వీధుల్లో తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జమ్మాదేవిపేటలో గ్రామదర్శిని కార్యక్రమంలో సిఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రులను ప్రధాని మోదీ నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. వైసీపీ ఎంపీల రాజీనామాల డ్రామాను ప్రజలు అర్ధం చేసుకున్నారని తెలిపారు. పవన్‌ కల్యాణ్‌ తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఎస్ కోటలో...సిఎం ముఖాముఖి

ఎస్ కోటలో...సిఎం ముఖాముఖి

విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా శృంగవరపుకోటలో గ్రామస్థులతో ముఖాముఖి సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఆరేడు లక్షల మందికి పెన్షన్లు, రేషన్‌ కార్డులు ఇస్తున్నామని, ఇళ్లు చాలా వరకు నిర్మించామని, సిమ్మెంట్‌ రోడ్లు వేస్తామని అన్నారు. గ్రామంలో పెండింగ్ లో ఉన్న చిన్న చిన్న పనులన్నీ పూర్తి చేసి గ్రామస్థుల ఆదాయం పెంచడానికి తాను కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి కుటుంబానికి నెలకు రూ. 10వేలు ఆదాయం రావాలని అన్నారు.

ఇంకా ఏం కావాలి?...సిఎం చంద్రబాబు

ఇంకా ఏం కావాలి?...సిఎం చంద్రబాబు

తానిచ్చిన డబ్బుకు - మీ డబ్బు రెండు, మూడు లక్షలు అదనంగా వేసుకుని బ్రహ్మాండంగా ఇళ్లు కట్టుకున్నారని, చాలా సంతోషమని చంద్రబాబు ఈ సందర్భంగా గ్రామస్థులతో అన్నారు. ఇంకా ఈ గ్రామానికి ఏం కావాలో చెబితే అధికారులు తన దృష్టికి తీసుకువస్తారని, తక్షణమే చర్యలు తీసుకుంటామని చంద్రబాబు గ్రామస్తులకు హామీ ఇచ్చారు.

వర్షం దెబ్బ...ఏర్పాట్లు చెల్లాచెదురు

వర్షం దెబ్బ...ఏర్పాట్లు చెల్లాచెదురు

ఎస్.కోటలో సీఎం చంద్రబాబు సభకు వర్షం దెబ్బ తగిలింది. భారీ ఈదురు గాలులు, భారీ వర్షం ధాటికి సభా ప్రాంగణం దగ్గర టెంట్లన్నీ కుప్పకూలాయి. ఈదురు గాలులు బలంగా వీస్తుండటంతో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. మరోవైపు భధ్రతా బలగాలు సీఎం చంద్రబాబుకు రక్షణ వలయంగా నిలిచాయి.

English summary
Vizianagaram: Chief Minister Chandrababu Naidu, who is visiting Vijayanagara district. However, the second half of the CM Chandra babu programmes has disrupted by heavy rain.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X