అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Weather Report: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఆ జిల్లాలకు వర్షసూచన..

|
Google Oneindia TeluguNews

బంగాళాఖాతంలో వాయిగుండంతో రానున్నరెండు రోజుల్లో నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, ప్రకాశం జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వా­తా­వ­రణ శాఖ తెలిపింది. నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారినట్లు వివరించింది.బంగాళాఖాతంలో వాయిగుండంతో రానున్నరెండు రోజుల్లో నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, ప్రకాశం జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వా­తా­వ­రణ శాఖ తెలిపింది. నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారినట్లు వివరించింది.

తమిళనాడు

తమిళనాడు

ఈ వాయుగుండం శ్రీలంకలోని ట్రింకోమలికి తూర్పు ఈశాన్యానికి 420 కి.మీ, తమిళనాడులోని నాగపట్టణం దక్షిణ ఆగ్నేయా­­నికి 600 కి.మీ, చెన్నైకి ఆగ్నేయంగా 690 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని పేర్కొంది. వచ్చే 24 గంటల్లో ఈ వాయుగుండం ఉత్తర వాయవ్య దిశగా కదిలి, పశ్చిమ నైరుతి దిశగా శ్రీలంక మీదుగా కొమోరిన్‌ ప్రాంతం వైపు వెళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

చలి తీవ్రత

చలి తీవ్రత

ఇటు తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. తూర్పు, ఈశాన్య భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తుండటంతో రాష్ట్రంలో చలి అధికమవుతుందని వాతావరణ అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జి

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జి

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 10.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా.. ఆదిలాబాద్‌ జిల్లాలో 10.8 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 11.4 డిగ్రీలు, నిర్మల్‌ జిల్లాలో 11.7 డిగ్రీలు, మంచిర్యాల జిల్లాలో 12.7, సిద్దిపేట జిల్లా అంగడి కిష్టాపూర్‌లో 13.1 డ్రిగీలు ఉష్ణోగ్రత నమోదయింది.

English summary
The India Meteorological Department has said that rains are likely to occur in Nellore, Chittoor, Kadapa, Anantapur and Prakasam districts in the next two days due to flooding in the Bay of Bengal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X