'కొండవీటి వాగు ముంపుతో అమరావతికి నష్టం లేదు, రాజధానిని అడ్డుకోవద్దు'
అమరావతి: రాజకీయ కారణాలతోనే రాజధఆని అమరావతి నిర్మాణం పైన కోర్టులో కేసు వేశారని రాజధాని రైతు సమాఖ్య శుక్రవారం నాడు ఆరోపించింది. అమరావతి భూములలో ప్రభుత్వ కార్యక్రమాలకు ఆటంకం కలిగించవద్దని వారు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
అమరావతితో అభివృద్ధి జరుగుతుందనే తాము భూములు ఇచ్చామని చెప్పారు. కేసుల పేరుతో అడ్డుకుంటే తాము నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రీన్ ట్రైబ్యునల్ కేసులో తాము కూడా భాగస్వాములయ్యామన్నారు. అయితే రైతుల మేలు కోరి కేసును ఉపసంహరించుకోవాలని రైతు సమాఖ్య కోరింది.

కేసులు వేసిన వారు గ్రీన్ ట్రైబ్యునల్‌కు ఆధారాలు చూపలేదన్నారు. కొండవీటి వాగు ముంపు వల్ల రాజధానికి ఇబ్బంది ఉండదని చెప్పారు. ముంపు లేకుండా ప్రభుత్వం మూడు రిజర్వాయర్లను నిర్మిస్తోందని చెప్పారు. రాజధాని రైతులకు ఆదాయపన్ను మినహాయింపు ఇవ్వాలని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని కోరుతామన్నారు.
హోదా కోసం లలిత సహస్రనామ పారాయణం
ఏపీకి ప్రత్యేక హోదా రావాలని కోరుతూ కాకినాడలో లలిత సహస్రనామ పారాయణ కార్యక్రమాన్ని చేపట్టారు. దీనిని ఎంపీ తోట నరసింహం సతీమణి తోట వాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... హోదా రాష్ట్రానికి చాలా అవసరమన్నారు. లలిత సహస్రనామ పారాయణంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications