కెసిఆర్ వ్యాఖ్యలు వ్యక్తిగతంగా చూడొద్దు: రాజయ్య

తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందని చెప్పారు. రూ. 19వేల కోట్ల రూపాయల రుణ మాఫీ చేసినట్లు తెలిపారు. నిరుపేదలకు భూములను పంచుతున్నారని ఆయన చెప్పారు. గత ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేసి.. తెలంగాణలో అదనంగా ఎకరం కూడా సాగులోకి తేలేదని రాజయ్య అన్నారు.
హెల్త్ యూనివర్సిటికీ వరంగల్‌లో ఎక్కువ భూములున్నాయన్నారు. తనపై తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు చేసిన వ్యాఖ్యలను వ్యక్తిగతంగా చూడవద్దని రాజయ్య అన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి తనకు తండ్రి లాంటి వారని ఉప ముఖ్యమంత్రి రాజయ్య అన్నారు. ఇటీవల వరంగల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఇష్టమొచ్చినట్లు హామీలివ్వొద్దని, సాధ్యమయ్యే హామీలే ఇవ్వాలని.. ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయాలని కెసిఆర్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రాజయ్యను పదవి నుంచి తొలగిస్తారనే ఊహాగానాలు వచ్చాయి. అయితే అలా ఏమి జరగలేదు.












Click it and Unblock the Notifications