కువైట్‌లో కడపజిల్లావాసి మృతి: మధు అరెస్టు, బాబు దిష్టిబొమ్మ దగ్ధం
కడప: పొట్ట కూటి కోసం వలస వెళ్లిన ఓ వ్యక్తి కువైట్‌లో ప్రమాదవశాత్తు మరణించాడు. కడప జిల్లా రాజంపటే మండలం మిట్టమీదపల్లె గ్రామానికి చెందిన పి. వెంకటేశ్వర్లు (40) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించాడు. అతను రెండు నెలల క్రితం పని వెతుక్కుంటూ కువైట్ వెళ్లాడు.
కువైట్‌లోని తెరాక్ ప్రాంతంలో భవన నిర్మాణ కూలిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో తెరాక్‌లో నిర్మాణంలో ఉన్న భవనానికి అద్దాలు బిగిస్తుండగా ప్రమాదవశాత్తు పై నుంచి పడి మృతి చెందాడు. ఈ విషయం తెలిసిన కుటుబం సభ్యులు రోదనలు మిన్నంటాయి. మృతదేహాన్ని స్వదేశం తీసుకుని రావడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి.
ఇదిలావుంటే, ఖమ్మం జిల్లా నుంచి విలీనమైన మండలాలు, గ్రామాల్లో ప్రజల సమస్యలను ప్రభుత్వం తీర్చతడం లేదని ఆరోపిస్తూ తూర్పు గోదావరి జిల్లా చింతూరులో బుధవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

సిపిఎం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కనీస మౌలిక సదుపాయాలు కూడా ప్రభుత్వం కల్పించలేకపోయిందని వారు నిరసించారు. ప్రజల సంక్షేమాన్ని ప్రభుత్వం పట్టించుకోనందుకు నిరసగా ఈ నెల 20వ తేదీన బంద్ పాటించాలని నిర్ణయించారు.
కాగా, శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధును పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని పొలాకి గ్రామంలో నిర్మించ తలపెట్టిన థర్మల్ విద్యత్కేంద్రం నిర్మాణానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో పాల్గొనేందుకు ఆయన శ్రీకాకుళం వచ్చారు.
దాంతో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు ఆయనను శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్‌లో అరెస్టు చేశారు. థర్మల్ విద్యుత్కేంద్రానికి వ్యతిరేకంగా కొద్ది రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications