వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

APలో MLA కొడితే కొట్టించుకోవాలి.. గిల్లితే గిల్లించుకోవాలి??

|
Google Oneindia TeluguNews

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో MLA కొడితే కొట్టించుకోవాలి.. గిల్లితే గిల్లించుకోవాలి.. అంతే. దానికి వేరే ప్ర‌త్యామ్నాయం లేదు. న‌న్నెందుకు కొట్టారు? న‌న్నెందుకు గిల్లారు? అంటే అక్క‌డ స‌మాధానం చెప్పేవారెవ‌రూ లేరు. APలో రాజ్యాంగం అమ‌ల‌వ‌డంలేద‌ని మొద‌టి నుంచి మేం చెబుతూనే ఉన్నామ‌ని తెలుగుదేశం పార్టీ నేత‌లు మండిప‌డుతున్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేల దౌర్జ‌న్యాలు ఎక్కువ‌య్యాయ‌ని, పోలీసును శాస‌న వ్య‌వ‌స్థ నియంత్రిస్తోంద‌ని విమ‌ర్శిస్తున్నారు.

 ఇంజ‌నీరుపై చేయిచేసుకున్న ఎమ్మెల్యే రాజా?

ఇంజ‌నీరుపై చేయిచేసుకున్న ఎమ్మెల్యే రాజా?


తాజాగా తూర్పుగోదావ‌రి జిల్లా రాజాన‌గ‌రం ఎమ్మెల్యే జ‌క్కంపూడి రాజా పోల‌వ‌రం ప్రాజెక్టు ఎడ‌మ కాల్వ ఏఈఈ సూర్య‌కిర‌ణ్‌పై చేయిచేసుకున్నారంటూ ఆయ‌న రాజ‌మండ్రి మూడో ప‌ట్ట‌ణ పోలీస్ స్టేష‌న్‌లో పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అయితే సీఐ మ‌ధుబాబు త‌మ‌కేమీ ఫిర్యాదు అంద‌లేద‌న్నారు. కానీ సూర్య‌కిర‌ణ్ మాత్రం ఫిర్యాదు చేసిన అనంత‌రం స‌హ‌చ‌ర ఏఈల‌తో క‌లిసి మీడియాతో మాట్లాడారు.

 నిధులు మంజూరు కాక‌పోవ‌డంతో..

నిధులు మంజూరు కాక‌పోవ‌డంతో..

పోల‌వ‌రం ప్ర‌ధాన ఎడ‌మ‌కాల్వ‌కు సంబంధించిన పుష్క‌ర కాల్వ రంగంపేట ప‌రిధిలో ఉంది. దానికి పూడిక తీత ప‌నులు, అభివృద్ధి ప‌నులు చేయాల్సి ఉండ‌గా నిధులు మంజూరు కాక‌పోవ‌డంతో ఆల‌స్య‌మ‌వుతోంది. నిధులు మంజూరైన త‌ర్వాత ఇవ్వండి అప్ప‌టివ‌ర‌కు మేమే ఆ ప‌నులు చేస్తామంటూ రైతులు పూడిక‌తీత ప‌నులు పూర్తిచేశారు. రెండు సంవ‌త్స‌రాలైనా నిధులుమంజూరు కాక‌పోవ‌డంతో రైతులు ఎమ్మెల్యేను ఆశ్ర‌యించారు. ఎమ్మెల్యే సంవ‌త్స‌రం నుంచి అధికారుల‌ను అడుగుతున్నారు.

 జ‌ల‌వ‌న‌రుల‌శాఖ స‌మావేశంలోనే..

జ‌ల‌వ‌న‌రుల‌శాఖ స‌మావేశంలోనే..

రాజ‌మండ్రిలో జ‌ల‌వ‌న‌రుల ఉన్న‌తాధికారుల‌తో జ‌రిగిన స‌మీక్ష స‌మాఏశంలో ఎమ్మెల్యే రాజా ఏఈఈ సూర్య‌కిర‌ణ్ ను నిధుల విష‌య‌మై ప్ర‌శ్నించారు. స‌మాధానం ఇస్తుండ‌గానే వ‌రుస‌గా తన చెంప‌పై మూడుసార్లు ఎమ్మెల్యే రాజా కొట్టినట్లు సూర్యకిరణ్ చెప్పారు. అక్క‌డి ఉన్న‌తాధికారులు కూడా ఎమ్మెల్యేను ఆప‌లేదు. ఈరోజు మ‌ధ్యాహ్నం ధ‌వ‌ళేశ్వ‌రం జ‌ల‌వ‌న‌రుల‌శాఖ కార్యాల‌యం వ‌ద్ద భోజ‌న విరామ సమయంలో సూర్య‌కిర‌ణ్‌తోపాటు ఇత‌ర ఏఈలు ధ‌ర్నా చేశారు. దీనికి సంబంధించి ఎమ్మెల్యే వివ‌ర‌ణ కూడా ఇవ్వ‌క‌పోవ‌డంపై తెలుగుదేశం పార్టీ నేత‌లు మండిప‌డుతున్నారు.

గతంలో కూడా...

గతంలో కూడా...

ఎమ్మెల్యే రాజా గతంలో కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగిపై చేయిచేసుకున్నారు. సీతానగరం మండలం జూలిమూడి వద్ద ఇసుక లారీ ఢీకొట్టడంతో ఒక వ్యక్తి మృతిచెందారు. 2017లో ఈ సంఘటన జరిగింది. ఆ సమయంలో రాజా ప్రతిపక్షంలో ఉన్నారు. మృతిచెందిన వ్యక్తికి న్యాయం చేయాలంటూ ఆయన ధర్నా చేస్తుండగా అక్కడికి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగిపై చేయిచేసుకున్న సంగతి తెలిసిందే.

English summary
Rajanagaram MLA Dadishetti Raja attacks assistant engineer Suryakiran
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X