రాజన్న క్యాంటీన్‌కు వందరోజులు పూర్తి
గుంటూరు:వైసీపీకి చెందిన మంగళగికి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఏర్పాటు చేసిన రాజన్న క్యాంటీన్ 100 రోజులకు చేరుకుంది. రాష్ట్రం లో ఎక్కడా లేని విధంగా మంగళగిరి లో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన రాజన్న క్యాంటీన్ అక్కడి పేద ప్రజల ఆకలి తీరుస్తుంది.
మూడు నెలల క్రితం ఏర్పాటు చేసిన ఈ క్యాటీన్ లో ప్రతిరోజు మధ్యాహ్నం నిరుపేదల ఆకలి తీర్చేందుకు కేవలం 4 రూపాయలకే నాణ్యమైన భోజనం పెడుతున్నారు.
చంద్రబాబు ప్రభుత్వం ఎన్ఠీఆర్ క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని హడావుడి చేయటం తప్ప రాజధాని గ్రామాల్లో అనుకున్న ప్రాంతాల్లో ఇంత వరకు క్యాంటీన్లను ఏర్పాటు చేయలేదని గతం లో ఆళ్ళ రామకృష్ణా రెడ్డి విమర్శించారు.

నాలుగు రూపాయలకే అందిస్తున్న రాజన్న క్యాంటీన్ లో మెనూ ఒక కప్పు సాంబార్ రైస్, ఓ కప్పు పెరుగన్నం, కోడిగ్రుడ్డు, ఒక అరటి పండు, వడియాలు వాటర్ ప్యాకెట్ అందిస్తున్నట్టు ఆయన చెప్పారు.100 రోజులు దాటుకున్న వేళ మారింతకాలం రాజన్న క్యాంటీన్ ముందుకు సాగాలని పట్టణం లోని పేదలు కోరుకుంటున్నారు.












Click it and Unblock the Notifications