శాడిస్ట్ మొగుడు: 'ఆ విషయం లీక్ చేసిందనే శైలజపై దాడి'

Posted By:
Subscribe to Oneindia Telugu
  Groom Beats Bride Mercilessly On First Night, Got Suspended

  చిత్తూరు: వివాహమైన రోజునే పడక గదిలో భార్యకు నరకం చూపాడు ఓ శాడిస్టు భర్త. సంసార జీవితానికి పనికిరాడనే విషయాన్ని దాచిపెట్టి ఓ యువతిని వివాహం చేసుకొన్నాడు రాజేష్. అయితే ఈ ఘటనను బయటకు చెప్పిందనే అక్కసుతోనే భార్యను చిత్ర హింసలకు గురి చేశాడని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటన సంచలనం సృష్టించింది.

  వివాహేతర సంబంధం: కూతురికి చిత్రహింసలు, ఆ సుఖం కోసమే ఇలా...

  చిత్తూరు జిల్లా మోతరంగనపల్లికి చెందిన కుమారస్వామిరెడ్డి కుమారుడు రాజేష్‌ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.అయితే రాజేష్‌తో ఎంబీబీఎస్ చదివిన శైలజతో శుక్రవారం ఉదయం కాణిపాకంలో వివాహం జరిగింది.

  దారుణం: లెక్చరర్‌పై లైంగిక వేధింపులు,ప్యాంట్ విప్పి వికృతంగా...

  అదే రోజు రాత్రి కొత్త దంపతులకు శోభనం ఏర్పాటు చేశారు. అయితే తొలి రాత్రే రాజేష్ బండారం బట్టబయలైంది. దీంతో తన బండారం బట్టబయలు చేసిందనే అక్కసుతో శైలజపై నిందితుడు రాజేష్ చిత్రహింసలు పెట్టాడని పోలీసులు తెలిపారు.

  వివాహమైన కొన్ని గంటల్లోనే

  వివాహమైన కొన్ని గంటల్లోనే

  కాణిపాకంలో వివాహమైన కొన్ని గంటల్లోనే నూతన దంపతులకు శోభనం ఏర్పాటు చేశారు. అయితే శోభనం గదిలో భార్యకు తన అసలు విషయాన్ని రాజేష్ చెప్పాడు. తాను సంసార సుఖానికి పనికిరాననే విషయాన్ని భార్య శైలజకు చెప్పాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదని రాజేష్ బతిమిలాడాడు. అయితే ఈ విషయమై శైలజ బయటకు వచ్చి అందరికీ చెప్పేసింది.

  సరదాగా చెప్పానంటూ

  సరదాగా చెప్పానంటూ

  సంసార జీవితానికి పనికిరానని శైలజ అందరికీ చెప్పడంతో రాజేష్ తాను సరదాగానే ఈ విషయాన్ని చెప్పానని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే సరదాగా పెళ్ళి కూతురును ఆటపట్టించారని భావించారు. శైలజకు సర్ధిచెప్పి రాజేష్‌తో పంపారు. అయితే తన బండారాన్ని అందరికీ శైలజ చెప్పిందనే అక్కసుతో రాజేష్ ఆమెను చిత్రహింసలు పెట్టాడని పోలీసులు చెప్పారు.

  శైలజను కొరికిన రాజేష్

  శైలజను కొరికిన రాజేష్

  సంసార జీవితానికి పనికిరాననే విషయాన్ని బయటకు చెప్పినందుకు రాజేష్‌‌లో నరరూప రాక్షసుడిగా మారాడు. శైలజను చిత్ర హింసలు పెట్టాడు. ఆమె శరీరంపై ఇష్టమొచ్చినట్టు కొరికాడు. నోట్లో గుడ్డలు కుక్కి చిత్రహింసలకు పాల్పడ్డాడు. తల మీద బాదాడు.

  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శైలజ

  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శైలజ

  రాజేష్ చేతిలో గాయపడిన శైలజ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తీవ్రంగా ఆమె గాయపడింది. అయితే శైలజను గాయపర్చిన రాజేష్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో ఈ విషయాలు వెలుగు చూశాయి. అయితే అసలు విషయాన్ని దాచిపెట్టి రాజేష్‌కు వివాహం చేశారని బాధిత కటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Rajesh revealed reason for harassed his wife Shailaja.He is unfit for sexual life. so,rajesh harassed on sailaja said police.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి