రాజోలులో రాపాకపై జనసేన అభ్యర్ధి రెడీ - పార్టీలో చేరికలపై పవన్ కీలక నిర్ణయం..!!

2019 ఎన్నికల్లో జనసేన గెలిచిన ఏకైక స్థానం రాజోలు. అక్కడ గెలిచిన రాపాక వరప్రసాద్ కొద్ది కాలానికే వైసీపీకి దగ్గరయ్యారు. దీంతో, వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలవకుగా చూస్తానని పదే పదే చెబుతున్న పవన్ .. తమ అభ్యర్ధుల ఖరారు అదే రాజోలు నుంచి మొదలు పెట్టారు. ఇదే సమయంలో జనసేనలో చేరికలకు పవన్ డోర్స్ ఓపెన్ చేసారు. వైసీపీకి చెందిన నేతలు పవన్ సమక్షంలో జనసేనలో చేరారు. పొత్తుల వ్యవహారం పైన క్లారిటీ రాకపోయినా.. రెండు పార్టీల ద్వితీయ శ్రేణి నాయకత్వం పొత్తు ఖాయమనే భావనతో ఉంది.

వైసీపీ నుంచి జనసేనలోకి ఎంట్రీ

వైసీపీ నుంచి జనసేనలోకి ఎంట్రీ

రాజోలులో రాపాక వైసీపీకి దగ్గర అవ్వటం..పార్టీలో ప్రాధాన్యత ఇస్తుండటంతో వైసీపీకి బొంతు రాజేశ్వర రావు రాజీనామా చేసారు. 2014, 2019 ఎన్నికల్లో రాజేశ్వర రావు వైసీపీ నుంచి రాజోలు అసెంబ్లీ అభ్యర్ధిగా పోటీ చేసారు. వైసీపీ ప్రభుత్వంలో సలహాదారుగా పని చేసారు. కొద్ది రోజుల క్రితం పార్టీకి రాజీనామా చేసి పవన్ తో భేటీ అయ్యారు.

ఈ రోజు అధికారికంగా జనసేన కండువా కప్పుకున్నారు. అదే విధంగా విజయ నగరం జిల్లాకు చెందిన గురాన అయ్యులు, పీ గన్నవరం నియోజకవర్గానికి చెందిన కొమ్మూరి కొండల రావు జనసేనలో చేరారు. అదే విధంగా ఇప్పటి వరకు పార్టీలో చేరికలపైన నిర్ణయం పెండింగ్ లో ఉంచిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు ఇక పార్టీలో చేరికలను ఆమోదించాలని నిర్ణయించారు. పార్టీ క్షేత్ర స్థాయిలో బలోపేతం పైన ఫోకస్ పెట్టారు.

రాపాక పైన జనసేన అభ్యర్ధిగా..

రాపాక పైన జనసేన అభ్యర్ధిగా..

ఇప్పుడు రాజోలు వైసీపీ నేత రాజేశ్వర రావు జనసేనలో చేరటంతో వచ్చే ఎన్నికల్లో పోటీ ఎవరి మధ్య ఉంటుందనే చర్చ మొదలైంది. ప్రస్తుత జనసేన ఎమ్మెల్యే రాపాక రానున్న ఎన్నికల్లో వైసీపీ అధికారిక అభ్యర్ధిగా పోటీ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. గతంలోనూ రాపాక కాంగ్రెస్ నుంచి గెలుపొందారు.

ఆయన ఇప్పుడు వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు. దీంతో, ఇప్పుడు వైసీపీ నుంచి తాజాగా పార్టీలో చేరిన రాజేశ్వరరావుకు దక్కుతుందా లేదా అనేది ఆసక్తి కరంగా మారుతోంది. తమ పార్టీ నుంచి గెలిచి వైసీపీలో చేరిన రాపాక ను వచ్చే ఎన్నికల్లో గెలవకుండా అడ్డుకోవటం జనసేన లక్ష్యంగా కనిపిస్తోంది.

ఇక, ఇప్పటికే పార్టీలో చేరిన మాజీ ఐఏఎస్ వరప్రసాద్ జనసేన నుంచి రాజోలు టికెట్ ఆశిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చక్కబడి అభివృద్ధి చెందాలంటే మంచి నాయకత్వం అవసరం. అది పవన్ కళ్యాణ్ ద్వారానే సాధ్యమవుతుందని వర ప్రసాద్ చెప్పుకొచ్చారు.

పవన్ కల్యాణ్ నిర్ణయం ఎవరి వైపు..

పవన్ కల్యాణ్ నిర్ణయం ఎవరి వైపు..

అటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వరప్రసాద్..మరో వైపు గతంలో రెండు పార్టీ పోటీ చేసి ఓడి వైసీపీ నుంచి చేరిన రాజేశ్వర రావు. ఇద్దరూ జనసేన నుంచి రాపాక సీటు ఆశిస్తున్నారు. రాజేశ్వర రావుకు నియోజవర్గంలో రాజకీయం..గ్రామా గ్రామన పరిచయాలు..ఎలక్షన్ నిర్వహణ అనుభవం ఉన్నాయి.

రాపాక వర ప్రసాద్ బలాలు బలహీనతల పైన పూర్తి అవగాహన ఉంది. అయితే, పవన్ సీటు గురించి ఎటువంటి హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. అదే విధంగా అటు ఐఏఎస్ వరప్రసాద్ సీటు తనకే దక్కుతుందనే ధీమాతో ఉన్నారు.

దీంతో, రాజోలులో జనసేన అభ్యర్దులు రెడీగా ఉన్నారు. ఎవరికి సీటు ఇస్తారనేది పవన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పొత్తుల పైన స్పష్టత వచ్చిన తరువాతనే అభ్యర్దుల విషయంలో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+