ఈసారి ఏపీలో రాజ్యసభ లెక్క ఇదే- అనర్హత పడితే సమీకరణంలో మార్పు ఇలా.. !

ఈ ఏడాది మార్చిలో ఏపీ నుంచి మూడు రాజ్యసభ ఎంపీ సీట్లు ఖాళీ అవుతున్నాయి. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్, వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీజేపీ ఎంపీ సీఎం రమేష్ పదవీకాలం ముగుస్తుండటంతో రాష్ట్రంలో మూడు సీట్లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. సాధారణంగా పరిస్దితుల్లో ఈ మూడు ఎంపీ సీట్లను అసెంబ్లీలో పూర్తి మెజారిటీ కలిగిన వైసీపీ గెల్చుకోవాల్సి ఉంది. కానీ సార్వత్రిక ఎన్నికల వేళ మారిన పరిస్ధితులతో వీటిపై ఉత్కంఠ నెలకొంది.

రాజ్యసభ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని ఎప్పుడో మూడేళ్ల క్రితం ఎమ్మెల్యే పదవికి టీడీపీ నేత గంటా శ్రీనివాస్ చేసిన రాజీనామాను తాజాగా అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించారు. అలాగే మూడేళ్లుగా ఇష్టారాజ్యంగా పార్టీలు మారిన మరో 9 మంది ఎమ్మెల్యేలపై వచ్చిన అనర్హత వేటు ఫిర్యాదులపై నోటీసులు జారీ చేశారు. వీటిపై వారం రోజులుగా సంతృప్తికర వివరణ ఇవ్వకపోతే వేటు తప్పదని హెచ్చరికలు కూడా జారీ చేశారు. దీంతో ఈ 9 మందిపై అనర్హత వేటు కత్తి వేలాడుతోంది.

rajya sabha biennial elections in ap- how many mla votes needed for a candidate to win a seat?

ఏ రాష్ట్రంలో అయినా రాజ్యసభ ఎన్నికల్లో ఖాళీ అయిన సీట్లు, ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యే సీట్ల లెక్క ఆధారంగా సమీకరణం నిర్ణయం అవుతుంది. ఈ లెక్కన మన రాష్ట్రంలో ప్రస్తుతం మూడు సీట్లు ఖాళీ అవుతుండగా.. 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ లెక్కన చూస్తే 175/3 +1= 43.75 అంటే 44 ఎమ్మెల్యే ఓట్లు అవసరం అవుతాయి. కానీ అక్కడే ఓ తిరకాసు ఏర్పడుతోంది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే ఈ లెక్క పూర్తిగా మారిపోతుంది.

ప్రస్తుతం అనర్హత వేటు ముప్పు ఎదుర్కొంటున్న 9 మంది ఎమ్మెల్యేలపై వేటు పడితే ఇప్పటికే రాజీనామా ఆమోదించిన గంటా శ్రీనివాస్ తో కలిపి ఈ సంఖ్య 10 అవుతుంది. మొత్తం ఎమ్మెల్యేలు 175 నుంచి ఈ 10 మందిని తీసేస్తే కేవలం 165 మంది మాత్రమే ఉంటారు. అప్పుడు సమీకరణం 165/3+1= 41 మాత్రమే అవుతుంది. అప్పుడు కూడా వైసీపీ బలం 147 అవుతుంది. టీడీపీ బలం 18 అవుతుంది. అయితే ప్రస్తుతం ఇన్ ఛార్జ్ ల మార్పుతో అసంతృప్తిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ నిలబెట్టే అభ్యర్ధి(నిలబెడితే)కి ఓటేస్తే అప్పుడు ఓ సీటును ఆ పార్టీ దక్కించుకునే అవకాశాలు ఉండొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+