బాబు స్కిల్ స్కామ్‌పై ఆర్జీవీ 12 ప్రశ్నలు- లా పాయింట్లు

రాజమండ్రి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు. ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది.

2014-2019 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని, డొల్ల కంపెనీలను సృష్టించి, ముడుపులను పొందారనే ఆరోపణలు చంద్రబాబుపై ఉన్నాయి. దీనిపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.

Ram Gopal Varma 12 questions, who are defending Chandrababu in the skill scam case

ఈ వ్యవహారంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. దీనిపై ఆయన రియాక్ట్ కావడం ఇదే తొలిసారి. మొదటి నుంచీ ఈ కుంభకోణం గురించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తోనే ఉన్నారాయన. సెక్షన్ సీఆర్పీసీ మొదలుకుని, పలు అంశాలను ప్రస్తావిస్తూ ఓ ట్వీట్ పోస్ట్ చేశారు.

స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణానికి సంబంధించి 12 ప్రశ్నలను సంధించారు. వీటికి ఎవరైనా సరే బదులు ఇవ్వొచ్చని చెప్పారు. ఈ 12 ప్రశ్నలకు ఎవరూ స్పందించకపోతే అన్ని ప్రశ్నలకూ అవునని సమాధానం ఇచ్చినట్టేనని ట్విస్ట్ ఇచ్చారు. చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్ పేరునూ ఇందులో పొందుపరిచారు.

1. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టుపై చేసుకున్న ఒప్పందం బోగస్. ‌అవునా?, 2. ఈ ఫేక్‌ ఒప్పందంతోనే 300 కోట్ల రూపాయలకు పైగా మొత్తాన్ని ఇచ్చారు. అవునా ?, 3. ఆంధ్రప్రదేశ్‌ ప్రభత్వం నుంచి ఈ డబ్బు విడుదల చేయడానికి అన్ని రూల్స్‌ను ఉల్లంఘించారు. డబ్బు విడుదల కోసం అధికారుల అబ్జెక్షషన్స్ పెడచెవిన పెట్టారు. అవునా? అని ప్రశ్నించారు.

4. తమకు ఎలాంటి డబ్బు ముట్టలేదని, అసలు ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని, సీమెన్స్‌ కంపెనీ లిఖిత పూరకంగా చెప్పింది. అవునా?.5. 90 శాతం గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ఇచ్చే ఎలాంటి స్కీం తమ వద్ద లేదని సీమెన్స్‌ చెప్పింది. అవునా?, 6. ఈ మేరకు సెక్షన్‌ 164 సీఆర్పీసీ కింద జడ్జి ఎదుట ఏపీ అధికారులు, సీమెన్స్‌ ప్రతినిధులు స్టేట్‌మెంట్లు ఇచ్చారు. అవునా?

Ram Gopal Varma 12 questions, who are defending Chandrababu in the skill scam case

7. విడుదల చేసిన ఆ డబ్బు ఎక్కడికి పోయిందో తెలుసుకోవాల్సిన భాద్యత ప్రభుత్వానికి వుంది. అవునా?, 8. ఆ డబ్బును ఎవరు తీసుకున్నారో కనిపెట్టాల్సిన భాద్యత ప్రభుత్వానికి వుంది. అవునా?, 9. 300 కోట్ల రూపాయలకు పైగా డబ్బును షెల్‌ కంపెనీల ద్వారా, మధ్యవర్తుల ద్వారా మళ్లించారు. అవునా?.

10. స్కిల్‌ కేసులో ఈడీ దర్యాప్తు చేసి నలుగురిని అరెస్టు చేసింది. అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. ఇప్పుడు మీ అభియోగం సెంట్రల్ ఏజెన్సీ ఈడీ ఈ విషయంలో రాజకీయ ప్రతీకారానికి దిగిందని అంటున్నారు. అవునా ?, 11. విజయవాడలోని ఏసీబీ కోర్టు దాదాపు 10 గంటల సేపు ఇరుపక్షాల వాదనలు విని ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని భావించే చంద్రబాబుకు రిమాండ్‌ విధించింది. అవునా ?

12. ఇళ్ల నిర్మాణం విషయంలో డబ్బు చంద్రబాబు చేతిలోకి వెళ్లిందనే విషయాన్ని ఐటీ నోటీసుల ద్వారా ఎలా వెలుగులోకి వచ్చిందో, అలాగే స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కాంలో అనేక షెల్‌ కంపెనీలు, నిందితులైన యోగేష్‌ గుప్తా, మనోజ్‌ వాసుదేవ్‌ పార్దసాని తదితరుల ద్వారా ఆయన మాజీ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్‌కు, అక్కడ నుంచి ఆయనకు చేరిందని ఈడీ చెబుతోంది. అవునా ?, ఒకవేళ కాదంటే పెండ్యాల శ్రీనివాస్ ఎందుకు పారిపోయినట్టు? అని రామ్ గోపాల్ వర్మ ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+