Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాపులు + కమ్మోళ్లు ÷ సేనలు ఈజ్ నాట్ = ఓట్లు

అమరావతి: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడి మధ్య ఏర్పాటైన భేటీ హీట్ ఇంకా తగ్గట్లేదు. టీడీపీ, జనసేన పార్టీలు దీన్ని సమర్థించుకుంటోండగా.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతోంది. తాను చంద్రబాబుకు అమ్ముడుపోయానని పవన్ కల్యాణ్ మరోసారి నిరూపించుకున్నాడంటూ ధ్వజమెత్తుతోంది. కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకును చంద్రబాబు పాదాల వద్ద తాకట్టు పెట్టాడంటూ నిప్పులు చెరుగుతోంది.

రాజకీయంగా..

రాజకీయంగా..

వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ కల్యాణ్-చంద్రబాబు భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది కాస్తా తెలుగుదేశం- జనసేన పార్టీల మధ్య పొత్తులకు కారణమౌతోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఆ దిశగా పవన్ కల్యాణ్ ఓ అడుగు ముందుకు వేశారని, భారతీయ జనతా పార్టీతో తెగదెంపులు తప్పకపోవచ్చనీ అంటున్నారు.

 పాతిక సీట్లపై క్లారిటీ..

పాతిక సీట్లపై క్లారిటీ..

చంద్రబాబు-పవన్ కల్యాణ్ భేటీ నేపథ్యంలో తెలుగుదేశం- జనసేన పార్టీ మధ్య అధికారిక ప్రకటనలు, సీట్ల పంపకాలు మాత్రమే మిగిలి ఉన్నాయని అంటున్నారు. ఈ దిశగా త్వరలోనే ఈ రెండు పార్టీలు ఏకాభిప్రాయానికి వస్తాయనీ చెబుతున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి జనసేన 30 అసెంబ్లీ, అయిదు నుంచి ఎనిమిది లోక్ సభ స్థానాలను అడుగుతోందని.. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రతిపాదనలను చంద్రబాబుకు పంపించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

రామ్ గోపాల్ వర్మ అటాక్స్..

రామ్ గోపాల్ వర్మ అటాక్స్..

చంద్రబాబు- పవన్ కల్యాణ్ సమావేశంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన దాడిని కొనసాగిస్తూనే వస్తోన్నారు. తనదైన శైలిలో సెటైర్లు సంధిస్తోన్నారాయన. ఇదివరకూ ఆయన చంద్రబాబు వైఖరిని తప్పు పట్టారు. కందుకూరు, గుంటూరుల్లో చంద్రబాబు సభల్లో సంభవించిన తొక్కిసలాటలో ఏకంగా 11 మంది దుర్మరణంపాలు కావడం పట్లా ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

 రిప్ కాపులు అంటూ..

రిప్ కాపులు అంటూ..

చంద్రబాబు-పవన్ కల్యాణ్ భేటీ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ- అటు కాపులు, కమ్మ సామాజిక వర్గాలపై ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. కేవలం డబ్బుల కోసం పవన్ కల్యాణ్.. తన సొంత సామాజికవర్గమైన కాపులను కమ్మ వాళ్లకు అమ్ముతాడని తాను ఏ మాత్రం ఊహించలేదని వ్యాఖ్యానించారాయన. కాపులకు రిప్ పోస్ట్ పెట్టారు. కమ్మవాళ్లకు కంగ్రాట్యులేట్ చేశారు.

 ఇప్పుడు మళ్లీ..

ఇప్పుడు మళ్లీ..

అక్కడితో ఆగలేదు రామ్ గోపాల్ వర్మ. తన దాడిని కంటిన్యూ చేశాడు. ఇప్పుడు కూడా అదే రేంజ్ లో స్పందించారు. కాపులు, కమ్మ వాళ్లు, జనసేనలను ఉటంకిస్తూ ట్వీట్ చేశారు. ఆయా సమీకరణాలన్నింటినీ ఆయన మేథమేటిక్స్ తో పోల్చారు. కాపులు - కాపులు x కాపులు + కమ్మోళ్ళు ÷ సేనలు - సేనలు ఇస్ నాట్ = ఓట్లు. కాపులు, కమ్మవాళ్ల సమీకరణాలు అర్థం కావట్లేదని, ఇందులో జనసేన ప్రమేయం వల్ల ఓట్లు రావనీ తేల్చి చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+