దేవుడే కాపాడలేదు, ఆయనేం చేస్తారు: చంద్రబాబుకు రాంగోపాల్ వర్మ మద్దతు
హైదరాబాద్: పుష్కరాల తొలి రోజు రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాట ఘటనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే బాధ్యులని నలువైపుల నుంచి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. చంద్రబాబుకు మద్దతు పలుకుతూనే పలు వివాదాస్పద సందేశాలను ట్విట్టర్ వేదికగా వెలిబుచ్చారు.
For the pushkara deaths How come everybody blames only Poor C B Naidu and nobody blames God?
— Ram Gopal Varma (@RGVzoomin) July 18, 2015 తొక్కిసలాట గురించి ట్విట్టర్ స్పందిస్తూ.. ‘పుష్కరాల్లో తొక్కిసలాట జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతే.. దేవుడ్ని నిందించకుండా, చంద్రబాబును నిందించడమేంటి?' అని వ్యాఖ్యానించారు.
Why din't God stop those poor devotees from being killed in pushkaras..is it becos they prayed lesser than other devotees who stayed alive?
— Ram Gopal Varma (@RGVzoomin) July 18, 2015 అంతటితో ఆగకుండా.. ‘పుష్కరాల్లో అంతమంది భక్తులు చనిపోతుంటే.. దేవుడే ఎందుకు కాపాడలేదు. ఎందుకంటే.. చనిపోయిన వారందరూ బతికున్న వారికంటే తక్కువగా ప్రార్థించారు' అని చెప్పారు.
If God himself couldn't save his own devotees what can poor C B Naidu do?
— Ram Gopal Varma (@RGVzoomin) July 18, 2015 పుష్కరాల తొలి రోజున రాజమండ్రి పుష్కర ఘాట్‌లో తొక్కిసలాట జరిగి 27 మంది భక్తులు తమ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో ఏపి సిఎం చంద్రబాబుపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆ విమర్శలపైనా వర్మ స్పందించారు. దేవుడే తన భక్తులను కాపాడలేకపోతే.. చంద్రబాబు ఎలా కాపాడతారని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications