చంద్రబాబు సర్కార్‌కు రాంగోపాల్ వర్మ కౌంటర్..ఎవరి మనోభవాలు దెబ్బతీశాయట..!
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారని ఆంధ్రప్రదేశ్‌లోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టీడీపీ కార్యకర్తలు ఆయనపై పెద్ద ఎత్తున ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేసి, ఆయన్ను విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు.
ఎప్పుడో సంవత్సరం క్రింద పెట్టిన ట్వీట్స్ కి ఇప్పుడు మనోభావలు దెబ్బతిన్నాయంటా..!!#RGV #RamGopalVarma #PawanKalyan #Chandrababu #NaraLokesh #Oneindiatelugu pic.twitter.com/VpwghfLoiH
— oneindiatelugu (@oneindiatelugu) November 26, 2024
అయితే పోలీసులు ఇచ్చిన నోటీసులపై రామ్ గోపాల్ వర్మ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో, అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు ఆయన ఇంటికి చేరుకున్నారు. ఆయన్ను అరెస్ట్ చేయాని పోలీసులకు నిరాశ ఎదురైంది. రామ్ గోపాల్ వర్మ ఇంట్లో లేకపోవడంతో పోలీసులు వెనుతిరిగారు. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

అయితే తాజాగా రామ్ గోపాల్ వర్మ దీనిపై ఓ వీడియో విడుదల చేశారు. పోలీసుల నోటీసులకు తాను ఏడవడం లేదని, వణికిపోవడం లేదని చెప్పారు. తాను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ఎవరి మనోభావాలో దెబ్బతీశాయట అంటూ మళ్లీ వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. తాను పోస్టు పెట్టిన వారికి కాకుండా.. ఇంకెవరో మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయన్నారు. సినిమా పనిలో ఉండడం వల్ల స్పందించడం కుదరలేదని, తనకు వచ్చిన నోటీసులకు తాను సమాధానం ఇచ్చానని రామ్ గోపాల్ వర్మ గోపాల్ వర్మ తెలిపారు.












Click it and Unblock the Notifications