విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌పై దాడి ఎఫెక్ట్: బాబు మాటలతో మనస్తాపం, టీడీపీకి రామారెడ్డి రాజీనామా

|
Google Oneindia TeluguNews

అమరావతి: తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ లీగల్‌సెల్‌ ఉపాధ్యక్షుడు మేడపాటి రామారెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగితే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు స్పందించిన తీరు సరిగా లేదని అన్నారు.

బాబు అలా ప్రవర్తించి ఉంటే హుందాగా ఉండేది..

బాబు అలా ప్రవర్తించి ఉంటే హుందాగా ఉండేది..

‘జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగితే ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు తొలుత ఆ ఘటనను తీవ్రంగా ఖండించాలి. నిజాలు నిగ్గుతేల్చేందుకు నిష్పక్షపాతంగా విచారణకు ఆదేశించాలి. నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆయన ఆ విధంగా వ్యవహరించి ఉంటే ఎంతో హుందాగా ఉండేది' అని రామారావు అభిప్రాయపడ్డారు.

జగన్‌పై దాడి ఆరోజే ఎందుకు?: మూడు నెలలుగా విశాఖ నుంచే, ఐనా ఎన్నడూ కలవని శ్రీనివాస్.!జగన్‌పై దాడి ఆరోజే ఎందుకు?: మూడు నెలలుగా విశాఖ నుంచే, ఐనా ఎన్నడూ కలవని శ్రీనివాస్.!

బాబు వ్యాఖ్యలతో మనస్తాపం..

బాబు వ్యాఖ్యలతో మనస్తాపం..


అయితే ‘దురదృష్టవశాత్తూ జగన్మోహన్ రెడ్డి హత్యాయత్నం అనంతరం ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు నన్నెంతో మనస్తాపానికి గురిచేశాయి' అని మేడపాటి రామారెడ్డి వ్యాఖ్యానించారు.

 బాబు తీరు వల్లే టీడీపీని వీడుతున్నా..

బాబు తీరు వల్లే టీడీపీని వీడుతున్నా..


చంద్రబాబు తీరుతో పార్టీ పట్ల పెంచుకున్న నమ్మకం నిర్వీర్యమైందని ఆవేదన రామారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆయన తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తెలిపారు. తనకు టీడీపీ అంటే ఎంతో ఇష్టమని ఆయన చెప్పారు. కేవలం ప్రస్తుత నేతల వ్యవహారశైలి నచ్చకే పార్టీ నుంచి బయటకు వస్తున్నానని రామారెడ్డి తెలిపారు. వ్యక్తిగత దూషణలు, ప్రతీ విషయలోను రాజకీయ లబ్ధిని ఆశిస్తూ పనిచేస్తున్న తీరుతో బాధ కలిగి పదవికి రాజీనామా చేశానన్నారు. మరే ఇతర పార్టీలో చేరాలనే ఉద్దేశ్యంతో ఇలాంటి వ్యాఖ్యలు చేయడంలేదని రామారెడ్డి పేర్కొన్నారు. తనకు పదవి ఇచ్చి గౌరవించిన నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

జగన్‌పై దాడి జరిగితే..

జగన్‌పై దాడి జరిగితే..

ఎన్‌టీ రామారావుపై ఉన్న అభిమానంతో టీడీపీలో పనిచేశానని రామారెడ్డి చెప్పారు. మానవత్వం ఉన్న ఎవ్వరైనా జగన్‌పై జరిగిన హత్యాయత్నాన్ని ఖండించాల్సిందేనన్నారు. ‘ఎవరికైనా కష్టం వస్తే శత్రువునైనా పలుకరించి అధైర్యపడవద్దని భరోసా ఇవ్వడం కనీస ధర్మం. ఇందుకు విరుద్ధంగా ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు విచక్షణ కోల్పోయి చేసిన వ్యాఖ్యలు నన్ను ఎంతో మనో వేదనకు గురిచేశాయన్నారు. పార్టీ అధినేతే అలా వ్యవహరిస్తుంటే కిందిస్థాయిలోని మంత్రులు కూడా ఆయనను అనుసరిస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీలో ఇమడలేక రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నా' అని రామారెడ్డి తెలిపారు.

English summary
Attack on YS Jagan issue: Medapati Rama Reddy resigned to TDP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X