వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

"పవన్ కళ్యాణ్‌కు తెలియదన్నారు, మీరేం చేశారు": తొక్కిసలాటపై సుజనా

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌/ రాజమండ్రి: ప్రత్యేక హోదాపై ప్రశ్నించిన జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు పార్లమెంటు నిబంధనలు తెలియవని ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు సభ్యుడులు అంటున్నారని, అలాంటప్పుడు పార్లమెంటు గురించి అంతా తెలిసిన మీరేం చేస్తున్నారని సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ అన్నారు. ఎప్పుడైనా ప్రత్యేక హోదా కోసం గళమెత్తారా? ఆయన ఎపి ఎంపీలను ప్రశ్నించారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌తో కలిసి గురువారం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

ఎంపీలు కేవలం వ్యాపారాలకే పరిమితమయ్యారని, రాష్ర్టానికి ప్రత్యేక హోదా, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ప్రత్యేక ప్యాకేజీల గురించి పోరాడటం లేదని ఆరోపించారు. వర్షాకాల సమావేశాల్లో అయినా ప్రత్యేకహోదా, ప్యాకేజీల కోసం పోరాడాలని సూచించారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

Ramakrishna questions TDP leaders on special status to AP

రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద జరిగిన ప్రమాదంపై కేంద్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు సుజనా చౌదరి స్పందించారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు బాగుండాలని ఆయన అన్నారు. ఆయన శుక్రవారంనాడు రాజమండ్రిలోని విఐపి ఘాట్‌లో పుష్కర స్నానం చేశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

మొన్న చోటు చేసుకున్న తొక్కిసలాట సంఘటన దురదృష్టకరమని అన్నారు. పుష్కరాల ప్రాంరభం రోజున రాజమండ్రిలోని కోటగుమ్మం పుష్కర ఘాట్‌లోతొక్కిసలాట జరిగి మరణించినవారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. రెండు రాష్ట్రాల్లో ప్రకృతి సహకరించాలని ప్రార్థించినట్లు తెలిపారు గోదావరి పుష్కరాలకు ఇప్పటి వరకు కోటి మంది భక్తులు హాజరయ్యారని, ఇప్పుడు పుష్కర ఏర్పాట్లు బాగున్నాయని సుజనా చౌదరి అన్నారు.

English summary
CPI Andhra Pradesh secretary K ramakrishna questioned AP MPs on special status to AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X