33 నెలలు జైల్లో క్షోభ, శిక్ష తగ్గించండి: రామలింగరాజు నాలుగు పేజీల లేఖ

హైదరాబాద్: సత్యం కుంభకోణం కేసులో దోషిగా తేలిన రామలింగ రాజు తనకు శిక్ష తగ్గించాలని న్యాయమూర్తి ముందు మొర పెట్టుకున్నారు. గతంలో 33 నెలల పాటు జైలులో తీవ్రమైన మానసిక క్షోభను అనుభవించినట్లు తెలిపారు.

పిల్లల బాధ్యతను తాను చూసుకోవాల్సి ఉందని, వయోవృద్ధులైన తల్లిదండ్రులను పోషించాల్సి ఉందని ఆయన చెప్పుకున్నారు. సామాజికంగా తాను ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టానని ఆయన అన్నారు. బిజినెస్ స్కూల్, ఈఎంఆర్ఐ, 108, 104 సేవలు అందించాని వివరించారు.

తన సేవలను గుర్తించైనా తనకు పడే శిక్ష తగ్గించాలని ఆనయ న్యాయమూర్తిని కోరారు. కేసులో తుది తీర్పు వెలువరించిన తర్వాత కోర్టు న్యాయమూర్తి దోషులతో విడివిడిగా మాట్లాడారు.

Ramalinga raju

ఈ సందర్భంగా రామలింగరాజు అరగంట పాటు సుదీర్ఘంగా న్యాయమూర్తితో తన కేసు పరిస్థితిని విన్నవించుకున్నారు. తనను క్షమించాలని కోరుతూ న్యాయమూర్తికి నాలుగు పేజీల లేఖను సమర్పించారు.

మిమ్మల్ని దోషులుగా ప్రకటించిన నేపథ్యంలో కోర్టుకు మీరు చెప్పుకోదలసింది ఏమైనా ఉందా అని కోర్టు అడిగి వారికి అవకాశం కల్పించింది. దీంతో నిందితులు పరిపరి విధాలుగా కోర్టుకు విన్నవించుకున్నారు. కోర్టులో స్వయంగా వాదనలు వినిపించిన ప్రధాన నిందితుడు రామలింగరాజు తన 30 ఏళ్ల పారిశ్రామిక జీవితంలో ఏ స్థాయి నుంచి ఏ స్థాయి ఎదిగారో, ఏవిధంగా తన ప్రస్థానం ప్రాంభమైందనే విషయాలను కోర్టుకు తెలియజేశారు.

తాను నీతి నిజాయితీగా ఉన్నందునే జరుగుతున్న మోసాల్ని తట్టుకోలేక కుంభకోణాన్ని స్వయంగా బయటపెట్టి ప్రజలను క్షమాపణ కోరినట్లు కోర్టుకు తెలిపారు. తాను కాలేయ సంబంధింత వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపారు. ఉద్దేశపూర్వకంగా ఎవరినీ మోసం చేయలేదని తప్పు చేసి ఉంటే క్షమించండని ఆయన విన్నవించారు.

దోషులుగా విధించే శిక్షలపై గురువారం కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. నేర తీవ్రతను సిబిఐ న్యాయవాది న్యాయమూర్తికి వివరించారు. సత్యం కుంభకోణం కేసులో న్యాయమూర్తి పది మందిని దోషులుగా నిర్ధారించిన విషయం తెలిసిందే.

సత్యం కుంభకోణం కేసులో రాజు సహా ఆయన తమ్ముడు రామరాజు, సత్యం మాజీ సీఎఫ్‌వో వడ్లమాని శ్రీనివాస్‌గుప్తా కూడా రూ.2 లక్షల వ్యక్తిగత పూచికత్తుపై సుప్రీం 2011 నవంబర్‌ 4న బెయిల్‌ మంజూరు చేసింది. అప్పటి నుంచి బయటే ఉంటూ విచారణకు హాజరవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+