నాంపల్లి సెషన్స్ కోర్టులో 'సత్యం' రాజు టీమ్ అపీల్
హైదరాబాద్: సత్యం కంపూటర్స్ కుంభకోణం కేసు దోషులు సోమవారంనాడు హైదరాబాదులోని నాంపల్లి సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో దోషులుగా తేలి చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్న రామలింగ రాజు సహా ఇతరులు న్యాయస్థానంలో అఫీల్ దాఖలు చేశారు. ప్రత్యేక న్యాయస్థానం చెప్పిన తీర్పును రద్దు చేయాలని వారు కోరురు.
సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో రామలింగ రాజు సహా పది మంది దోషులకు తమకు విధించిన శిక్షను సవాల్ చేస్తూ దాఖలు చేసుకున్న అప్పీళ్లను విచారించేందుకు హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే.

హైదరాబాదులోని నాంపల్లి ఎంఎస్‌జె కోర్టును ఆశ్రయించాలని హైకోర్టు వారికి సూచించింది. దాంతో ఈ కేసులో దోషులుగా తేలినవాళ్లంతా తొలుత నాంపల్లిలోని మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి (ఎంఎస్‌జె) కోర్టులోనే తమ అప్పీళ్లను దాఖలు చేయాల్సి ఉంటుంది.
అయితే, సత్యం రామలింగ రాజు అప్పీల్ పిటిషన్‌ను నాంపల్లి న్యాయస్థానం ఏప్రిల్ 20వ తేదీన తిరస్కరించింది. దీనిపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుకు వెళ్లాలని రామలింగ రాజుకు, ఇతరులకు న్యాయస్థానం సూచించింది.
సత్యం కుంభకోణం కేసులో రామలింగ రాజుకు, మరో తొమ్మిది మందికి నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు ఏడేళ్ల జైలు శిక్షను, భారీగా నగదు జరిమానాను విధించిన విషయం తెలిసిందే.
దీనిపై పై కోర్టుకు అప్పీల్ చేసుకునేందుకు న్యాయస్థానం సమయమిచ్చింది. దీంతో రామలింగ రాజు, తదితరులు నాంపల్లి కోర్టులో అప్పీల్ చేశారు. ప్రస్తుతం రామలింగ రాజు సహా మిగతా దోషులు హైదరాబాదులోని చర్లపల్లి జైలులో ఉన్నారు.












Click it and Unblock the Notifications