వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీటీడీలో ఇప్పటికీ చంద్రబాబు ఆదేశాలే అమలు .. అధికారులపై రమణ దీక్షితులు వివాదాస్పద వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

తిరుమల తిరుపతి దేవస్థాన గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు టీటీడీ అధికారులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీటీడీ ఈవో, ఏఈఓ ఇప్పటికీ చంద్రబాబు ఆదేశాన్ని పాటిస్తున్నారని, ఏపీలో ప్రభుత్వం మారినప్పటికీ, హైకోర్టు, ఏపీ సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ వాటిని పాటించడం లేదని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

సప్తగిరి పత్రికతో పాటు అన్యమత పత్రిక వివాదం .. గుంటూరులో తిరుపతి పోలీసుల దర్యాప్తుసప్తగిరి పత్రికతో పాటు అన్యమత పత్రిక వివాదం .. గుంటూరులో తిరుపతి పోలీసుల దర్యాప్తు

విధుల్లోకి తీసుకోకపోవటంపై రమణ దీక్షితులు వివాదాస్పద వ్యాఖ్యలు

విధుల్లోకి తీసుకోకపోవటంపై రమణ దీక్షితులు వివాదాస్పద వ్యాఖ్యలు


గతంలో టిడిపి హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజ్యాంగ విరుద్ధంగా, చట్టవిరుద్ధంగా 20 మందికి పైగా వారసత్వ అర్చకులను విధుల నుంచి తొలగించాలని పేర్కొన్న ఆయన తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ టిటిడి అధికారులు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షాత్తు సీఎం జగన్మోహన్ రెడ్డి తమను విధుల్లోకి తీసుకోవాలని చెప్పారని, విధుల్లోకి తీసుకుంటామని మాట కూడా ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. మాజీ సీఎం చంద్రబాబు ఆదేశాలే పాటిస్తున్నారని ఫైర్ అయ్యారు.

హైకోర్టు చెప్పినా , జగన్ చెప్పినా విధుల్లోకి తీసుకోలేదంటూ అసహనం

హైకోర్టు చెప్పినా , జగన్ చెప్పినా విధుల్లోకి తీసుకోలేదంటూ అసహనం

హైకోర్టు సైతం తమను విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించిందని పేర్కొన్నారు. కానీ టీటీడీ అధికారులు హైకోర్టు ఇచ్చిన, సీఎం జగన్ ఇచ్చిన ఆదేశాలను పాటించటం లేదంటూ విమర్శలు గుప్పించారు. ఇంకా తమని విధుల్లోకి తీసుకోవడం గురించి వేచి చూస్తున్నామని పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేసిన రమణ దీక్షితులు ఏపీ సీఎం వైయస్ జగన్ కు, బిజెపి నేత సుబ్రహ్మణ్యస్వామి లకు తన పోస్ట్ ను ట్యాగ్ చేశారు.

Recommended Video

Tirumala లో కొత్త Software.. భక్తులపై నిఘా..!
 టీటీడీలో రమణదీక్షితులు సంచలనం .. గతంలోనూ ఆరోపణలు

టీటీడీలో రమణదీక్షితులు సంచలనం .. గతంలోనూ ఆరోపణలు


తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ ప్రధాన అర్చకులుగా పని చేసిన రమణ దీక్షితులను ప్రధానార్చక పదవి నుంచి తొలగించడం, ఆ తర్వాత రమణదీక్షితులు టీటీడీ పాలకమండలిపై ఆరోపణలు చేయడం, శ్రీవారి ఆలయానికి సంబంధించి పలు సంచలన వ్యాఖ్యలు రమణదీక్షితులు చేయడంతో పెద్ద దుమారమే రేగింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి సంచలన ఆరోపణలు చేసిన రమణ దీక్షితులు గతంలోనూ చంద్రబాబు పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రాజకీయాల్లో దుమారం రేపారు.ఆయన ఇప్పటికీ టీటీడీలో విధుల్లో చేరలేదు. దీంతో అసహనం వ్యక్తం చేస్తున్న ఆయన టీటీడీ అధికారులు చంద్రబాబు ఆదేశాలు పాటిస్తున్నారని తీవ్రవ్యాఖ్యలు చేశారు.

English summary
Ramana deekshithulu, the chief priest of the Tirumala Tirupati temple, has made controversial remarks against TTD officials. He said that TTD Eo and AEO are still obeying Chandrababu's order, despite the government's change in AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X