ఎన్టీఆర్‌ను గద్దె ఎక్కించింది రామోజీనే..గద్దె దించింది రామోజీనే..!
ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూశారు. మూడు రోజుల క్రితం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆయన్ని ఆసుపత్రిలో చేర్చారు. పరీక్షలు చేసిన వైద్యులు స్టంట్ వేయాలని సూచించారు. వైద్యులు చెప్పినట్టుగా స్టంట్ వేసిన తర్వాత ఆయన పరిస్థితి కాస్త క్రిటికల్ అయింది. రెండు రోజుగా తీవ్ర అస్వస్థతతో వెంటిలేటర్ పై వైద్య చికిత్స పొందుతూనే ఆయన తుది శ్వాస విడిచారు. తెలుగు జర్నలిజం, వినోదం రంగంలో ఆయన చేసిన సేవలను పలువురు గుర్తు చేసుకుంటున్నారు.
ఇక టీడీపీ వ్యవస్థాపక సమయంలో రామోజీరావుది కూడా కీలక పాత్ర అనే చెప్పాలి. ఎన్టీ రామారావు టీడీపీని స్థాపించిన సమయంలో రామోజీరావు ఎన్టీఆర్‌కు మద్దతుగా నిలిచారు. కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా ముందుకొచ్చి పార్టీ స్థాపించిన ఎన్టీఆర్‌కు రామోజీరావు అండగా నిలిచారు. ఎన్టీఆర్ నిర్వహించిన ఎన్నికల ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో రామోజీరావు ప్రముఖ పాత్ర పోషించారు. అందరు ఆశించినట్టుగానే ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్‌కు సీఎం కావడం, ప్రజారంజక పాలన అందించడం జరిగింది.అయితే ఆ తర్వాత టీడీపీలో చోటు చేసుకున్న సంక్షోభంలో కూడా రామోజీరావు పేరు తెర మీదకు వచ్చింది.

ఎన్టీఆర్‌ను గద్దె దించి చంద్రబాబు సీఎం కావడంలో రామోజీరావుదే ప్రధాన భూమిక వహించారనే ఆరోపణలు వినిపించాయి. వైస్రాయ్ హోటల్‌లో చంద్రబాబుకు ఎమ్మెల్యేల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ..అధిక సంఖ్యలో ఉన్నారని చూపించి మిగిలిన ఎమ్మెల్యేలను చంద్రబాబుకు అనుకూలంగా మార్చారనే ఆరోపణలు ఆయనపై వచ్చాయి. ఇదే సమయంలో ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా రామోజీరావు పత్రికలో కథనాలు, కార్టూన్స్ వెలువడ్డాయి. ఎన్టీఆర్ సైతం రామోజీరావుపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఘటనలతో ఎన్టీఆర్ , రామోజీరావుల మధ్య దూరం పెరిగిందంటారు. ఏది ఏమైనప్పటికి ఎన్టీఆర్‌ను గద్దె ఎక్కించిన రామోజీనే..గద్దె దించిన ఆయనే అని రామోజీరావును మరోసారి గుర్తు చేసుకుంటున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications