టీ వచ్చింది, పాపం పెరిగింది: వర్షాలు వస్తాయన్న అమ్మ

Rangam Bhavishyavani at Lal Darwaja Bonalu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందుకు సంతోషమే కానీ, రాష్ట్రంలో పాపం పెరిగి.. పుణ్యం తగ్గిందని పాతబస్తీ బోనాల జాతరలో భవిష్యవాణి చెప్పారు. హైదరాబాదులో బోనాల జాతర ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. పలు ప్రాంతాల్లో ఆదివారం భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. సోమవారం రంగం, భవిష్యవాణి వినిపించారు.

పాతబస్తీలో జరిగిన బోనాల జాతరలో భవిష్యవాణి వినిపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాపాలు పెరగడం వల్లే వర్షాలు పడటం లేదన్నారు. అయితే, ఆలస్యమైనా వర్షాలు త్వరలో కురుస్తాయని చెప్పారు. ప్రజలు తెలంగాణను కోరుకున్నారని, అది ఏర్పాటైనందుకు సంతోషమన్నారు. అయితే, పుణ్యం తగ్గి పాపం పెరిగిందన్నారు.

ఆలస్యంగానైనా వర్షాలు కురుస్తాయని చెప్పారు. లాల్ దర్వాజా ఆలయాన్ని విస్తరింప చేయాలని చెప్పారు. ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం ఏర్పాటు చేయాలన్నారు. కాగా, అమ్మవారి దయ వల్లనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాకారమైందని భక్తులు బదులిచ్చారు. లాల్ దర్వాజాలో సుశీలమ్మ భవిష్యవాణి చెప్పారు.

హైదరాబాదులో పలుచోట్ల భారీ వర్షం

హైదరాబాదులోని పలుచోట్ల సోమవారం వర్షం కురిసింది. తార్నాక, ఉప్పల్, హబ్సిగూడ, నాచారం, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, బంజారాహిల్స్ తదితర ప్రాంతాలలో జోరు వర్షం కురిసింది. మైత్రివనం వద్ద సారథి స్టూడియో వద్ద ఓ చెట్టు రోడ్డు పైన కూలింది. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తదాయి. రెండు వైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+