కెసిఆర్‌పై వ్యాఖ్యలు: నారా లోకేష్‌పై కేసు నమోదు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తనయుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్‌పై కేసు నమోదు చేయాలని రంగారెడ్డి జిల్లా కోర్టు మంగళవారం హైదరాబాదులోని ఎల్బీ నగర్ పోలీసులను ఆదేశించింది. న్యాయవాదులు రవికుమార్, అభిలాష్ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు ఆ ఆదేశాలు జారీ చేసింది.
కోర్టు ఆదేశం మేరకు పోలీసులు లోకేష్‌పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. 153ఎ, 153బి, 295, 120బి సెక్షన్ల కింద పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై లోకేష్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ ప్రభుత్వాన్ని రౌడీలు నడిపిస్తున్నారని, శాంతిభద్రతలు అదుపు తప్పిపోయాయని, హిట్లర్ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పాలిస్తున్నాడని లోకేష్ ట్విట్టర్‌లో వ్యాఖ్యలు చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన లోకేష్‌పై హైదరాబాదులోని బంజారాహిల్స్, ఎల్బీ నగర్ పోలీసు స్టేషన్లలో ఇప్పటికే ఫిర్యాదులు చేశారు.
అంతే కాకుండా, తమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ప్రమోట్ చేయడంలో బిజిబిజీగా గడుపుతుంటే కెసిఆర్ అండ్ కో మాత్రం విద్వేషాలను ప్రమోట్ చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. నారా లోకేష్ తరుచుగా కెసిఆర్‌పై, తెలంగాణ ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు.
కెసిఆర్‌పై నారా లోకేష్ గతంలో కూడా పలు వ్యాఖ్యలు చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కూడా ఆయన ట్విట్టర్‌లో గతంలో వ్యాఖ్యలు చేశారు. తన అభిప్రాయాలను వెల్లడించడానికి, రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవడాని లోకేష్ ట్విట్టర్‌ను వేదికగా చేసుకున్నారు.












Click it and Unblock the Notifications