రంగారెడ్డి పీఠంపై మంత్రి భార్య, ప్రకాశంలో 'జగన్' ట్విస్ట్
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్‌గా సునీతా మహేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. సునీతా తెలంగాణ రాష్ట్ర మంత్రి మహేందర్ రెడ్డి సతీమణి. తెలంగాణ రాష్ట్ర సమితికి తెలుగుదేశం పార్టీ సభ్యులు మద్దతు పలకడంతో ఛైర్మన్ పదవి తెరాసను వరించింది.
తెరాస అభ్యర్థి సునీతకు 21 మంది జెడ్పీటీసీ సభ్యుల మద్దతు లభించింది. దీంతో జెడ్పీ ఛైర్ పర్సన్‌గా ఆమె ఎన్నికయ్యారు. జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్‌గా టీడీపీకి చెందిన ప్రభాకర్ రెడ్డి ఎన్నికయ్యారు. సునీత లక్ష్మా రెడ్డి వరుసగా రెండోసారి జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.

నెల్లూరు జెడ్పీ చైర్మన్ ఎన్నిక వాయిదా
నెల్లూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. కోరం లేకపోవడంతో జెడ్పీ ఛైర్మన్ ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. జెడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారానికి సంబంధించి కలెక్టర్ సభ్యులను సంతకాలు చేయాల్సిందిగా కోరారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున 22 మంది సభ్యులు సంతకాలు చేశారు. కాగా, టీడీపీ సభ్యులు సంతకాలు చేయకుండా బహిష్కరించారు. దీంతో కోరం లేకపోవడంతో ఎన్నిక వాయిదా పడింది.
మరోవైపు, ప్రకాశం జెడ్పీ చైర్మన్ ఎన్నిక కీలక మలుపు తిరిగింది. టీడీపీ మన్నె రవీందర్‌ను ప్రతిపాదించింది. దీంతో ఈదర హరిబాబు స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. హరిబాబు అభ్యర్థిత్వాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు బలపరిచారు. నామినేషన్ వేసిన హరిబాబుతో మంత్రి శిద్దా రాఘవ రావు, ఎమ్మెల్యే ఏలూరి చర్చలు జరిపారు. అయితే అవి ఫలించలేదు. చివరకు టీడీపీ రెబల్ అభ్యర్థి హరిబాబు జెడ్పీ చైర్మన్‌గా గెలిచారు. హరిబాబుకు 28 ఓట్లు, మన్నె రవీందర్‌కు 27 ఓట్లు వచ్చాయి. హరిబాబుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు మద్దతు పలికారు.












Click it and Unblock the Notifications