18 ఏళ్ల తర్వాత పోలీసులకు చిక్కిన రేప్ ఖైదీ: బాలుడి కిడ్నాప్

విజయవాడ: ఏళ్ల తరబడి పరారీలో ఉన్న ఓ ఖైదీనీతూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురం పోలీసులు పట్టుకున్నారు. రామచంద్రాపురానికి చెందిన గంగోలి శ్రీనుకు 1997వ సంవత్సరంలో అత్యాచారం కేసులో మూడేళ్ల జైలు శిక్ష పడింది.

అప్పట్లో జైలుకు తరలించేలోపు శ్రీను పోలీసుల కళ్లు గప్పి పరారయ్యాడు. అలా 18 ఏళ్లు గడిచాయి. 18 ఏళ్ల తర్వాత గంగోలి శ్రీనును రామచంద్రాపురం పోలీసులు పట్టుకున్నారు. ఆపై అతన్ని కోర్టులో హాజరుపర్చారు.

Rape culprit nabbed after 18 years

కడప నగరంలోని మున్సిపల్‌ మైదానం దగ్గర ఆరేళ్ల బాలుడు యశ్వంత్‌ను గుర్తుతెలియని దుండుగులు అపహరించారు. కిడ్నాపర్లు బాలుడి తల్లిదండ్రుల నుంచి భారీగా డబ్బు డిమాండ్‌ చేశారు.
కిడ్నాప్‌ అయిన బాలుడి తండ్రి మల్లికార్జున కడప మున్సిపల్‌ కార్పొరేషన్‌లో బిల్లు కలెక్టరుగా పనిచేస్తున్నారు. బాలుడి కిడ్నాప్‌ కడప నగరంలో సంచలనం సృష్టించింది.

ఇదిలావుంటే, అనంతపురం జిల్లాలోని కదిరి మండలం వీరేపల్లిపేటలో అడవి పందుల వేట కోసం పెట్టిన విద్యుత్‌ తీగలు తగిలి రైతు ఆదినారాయణరెడ్డి మృతి చెందారు. రైతు మృతితో వీరేపల్లిపేటలో విషాదం నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+