బాలికలతో బలవంతంగా వ్యభిచారం: విద్యార్థినిపై రేప్

ఈ విషయం పైన ఫిర్యాదు అందగానే జిల్లా ఎస్పీ స్వయంగా దర్యాఫ్తు చేపట్టారు. వంటమనిషి హాస్టల్లోకి కొంతమంది యువకులను పిలిపించి బాలికలతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తోంది. హాస్టల్‌కు వచ్చిన ఏడుగురు యువకులను అరెస్టు చేశారు.
బాలికపై అత్యాచారం?
జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ పరిధిలోని ఒక మండలంలో కొందరు బాలికల పైన అత్యాచారం జరిగినట్లుగా తమకు ఫిర్యాదులు అందాయని ఎస్పీ రఘురామ్ రెడ్డి తెలిపారు.
దీని పైన నిర్భయ చట్టం కింద సోమవారం కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఏఎస్పీ చంద్రశేఖర్ నేతృత్వంలో డీఎస్పీ సుబ్బరాజు, డీటీసీ డీఎస్పీ లలితలను విచారణకు నియమించినట్లు తెలిపారు. దీనికి సంబంధించి ఆ ప్రదేశాన్ని పరిశీలించి కొందరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications