సామూహిక అత్యాచారం యత్నం బాధితురాలి మృతి
హైదరాబాద్: ఇటీవల సికింద్రాబాదులోని చిలకలగూడా రైల్వే క్వార్టర్స్ వద్ద జరిగిన సామూహిక అత్యాచారం ఘటనలో గాయపడిన బాధితురాలు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందతూ మరణించింది. శనివారం ఉదయం ఆమె తుది శ్వాస విడిచింది.
జనవరి 29వ తేదీన రైల్వే క్వార్టర్స్ వద్ద నలగురు యువకులు ఆ యువతిపై కిరోసిన్ పోసి తగులబెట్టిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన యువతి అప్పటి నుంచి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందతూ వచ్చింది.

అత్యాచారం యత్నం చేయబోగా ఆ యువతి తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో ఆమెపై యువకులు కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
నిందితులు నలుగురిని ఇసాక్, షఖీల్, ఇస్మాయిల్, షౌకత్‌లుగా ఫిర్యాదు చేశారు. నిందితుల్లో ఒకడిగా భావిస్తున్న ఇసాక్‌తో సదరు యువతికి ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు. వీరిద్దరు ఫోన్లో మాట్లాడుకుంటున్ట్లు, తరుచూ కలుసుకుంటున్నట్లు తెలుస్తోంది.
వీళ్లు బుధవారం కలుసుకొని ఉండవచ్చునని, అప్పుడు వాగ్వాదం జరిగి ఉండవచ్చునని, ఆ సమయంలోనే ఇసాక్ తన మిత్రులతో కలిసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడనే కోణంలోను దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications