ఒంటరి స్త్రీలు టార్గెట్: కరుడు గట్టిన రేపిస్ట్ అరెస్టు
కర్నూలు: కర్నూలు నగరంలో ఒంటరిగా వెళ్తున్న మహిళలపై అత్యాచారానికి పాల్పడుతూ వచ్చిన కరడుగట్టిన రేపిస్టు, ఆటోడ్రైవర్ రవిని నగర పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. పోలీసులు రవిని విచారిస్తున్నారు. అతడిపై పలు రేప్ కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు.
నగరంలో ఒంటరిగా ఉన్న మహిళలను రవి తన ఆటోలో ఎక్కించుకుని, నగర శివారు ప్రాంతాలకు తీసుకు వెళ్లేవాడు. అక్కడ మహిళను బెదిరించి వారి వద్ద నుంచి నగదు, బంగారం దొంగిలించి, ఆపై వారిపై అత్యాచారం చేసి పరారయ్యేవాడు. దాంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడు రవి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ క్రమంలో బుధవారం నిందితుడు రవి పోలీసులకు చిక్కాడు.

కారు ఢీకొని తల్లీకొడుకు మృతి
నెల్లూరు జిల్లాలో బుధవారం ఉదయం విషాద సంఘటన జరిగింది. ఆగి ఉన్న లారీని, కారు ఢీకొని తల్లీకొడుకు మృతి చెందారు. పెళ్లకూరు మండలం తాళ్వాయిపాడు దగ్గర ఈ ఘోరం జరిగింది. ఈ ఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.
ఇన్నోవా కారు దూసుకెళ్లి, ఇద్దరు మృతి
పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు జాతీయ రహదారిపై మంగళవారం ఇన్నోవా కారు దూసుకెళ్లిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యా యి. హైదరాబాద్ నుంచి తణుకు వెళుతున్న ఇన్నోవా అతివేగంగా ఉంగుటూరు సెంటర్‌లో ఉన్న వ్యక్తులపైకి దూసుకుపోగా ఉంగుటూరుకు చెందిన గేదెల రాంబాబు(45), నల్లజర్ల మండలం సింగరాజుపాలేనికి చెందిన యాకోబు (40)లు మృతి చెందారు.












Click it and Unblock the Notifications