అరుదైన గుర్తింపు - అమెరికా అధ్యక్ష భవనంలో ఏపీ విద్యార్ధులు..!!
ఏపీ ప్రభుత్వ బడుల విద్యార్దులకు అరుదైన గుర్తింపు దక్కింది. అంతర్జాతీయంగా ప్రతిష్ఠాత్మక వేదికలపైన ఏపీ విద్యార్దులకు అవకాశం లభించింది. ఐక్యారాజ్యసమితి లో సదస్సులో ప్రసగించిందిన మన విద్యార్దులు..ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రత్యేక ఆహ్వానంతో అమెరికా అధ్యక్ష భవనానికి చేరుకున్నారు. అమెరికా అధ్యక్ష కార్యాలయ అధికారులు వైట్ హౌస్ లో ఉన్న విభాగాలను విద్యార్థులకు వివరించారు.
ఏపీ విద్యార్దులు అమెరికా పర్యటనలో అరుదైన అవకాశాలు దక్కించుకున్నారు. అంతర్జాతీయ వేదికలపైన భాగస్వామ్యం దక్కింది. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ఎస్డిజి సమ్మిట్ లో పాల్గొన్న విద్యార్థులు..ఏపీలో అమలు చేస్తున్న విద్యా సంస్కరణలను ప్రస్తావించారు. వాషింగ్టన్ లో వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులతో భేటీ అయిన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తమ ప్రతిభ చాటుకొనే అవకాశం దక్కింది.

ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ కార్యాలయం అధికారులతోనూ విద్యార్ధులు భేటీ అయ్యారు. అనూహ్యంగా అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ నుంచి సందర్శించిన విద్యార్దులకు అక్కడి అధికారులు శ్వేత సౌధం ప్రత్యేకతలను వివరించారు.

ఇప్పటి వరకు వైట్ హౌస్ బయటి ప్రాంతాలను చూసేందుకే అనుమతిచ్చే అధికారులు..తొలి సారి ఏపీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్దులకు లోపలి ప్రదేశాలను సందర్శించే అవకాశం కల్పించారు. వైట్ హౌస్ అధికారులు భవనంలోని ప్రతీ ఒక్క విభాగం ప్రత్యేకతలు..పని విధానం వివరించారు. అక్కడి విభాగాలు..సిబ్బంది పని తీరు..సెక్యూరిటీ సిద్దం..అధ్యక్షుడు నివసించే భవనం..కార్యాలయం పని విధానాలను తెలుసుకున్నారు.

ఈ నెల నుంచి ఐక్య రాజ్యసమితి ఆర్దిక, సామాజిక మండలిలో జరిగిన సస్టెయినబుల్ డెవలప్ మెంట్ గోల్స్ (ఎస్డీజీ) సదస్సుతో పాటు కొలంబియా యూనివర్సిలీలో జరిగిన గ్లోబల్ స్కూల్స్ సమ్మిట్ లో రాష్ట్రంలో అమలు చేస్తున్న నాడు - నేడు, విద్యా సంస్కరణలను వివరించారు. పది రోజుల అమెరికా పర్యటన ముగించి స్వదేశానికి తిరుగుపయనమయ్యారు.












Click it and Unblock the Notifications