సభలో ఊగిపోయిన రసమయి, వదిలేది లేదన్న కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభ్యుడు రసమయి బాలకిషన్ బుధవారం శాసన సభలో ఊగిపోయారు. ఎమ్మెల్యే సంపత్ దళితుల గురించి మాట్లాడుతున్నప్పుడు తెరాస సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సమయంలో రసమయి మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును తాము తమ దళిత బిడ్డగా చూస్తున్నామన్నారు. తమ దళితులకు డబుల్ బెడ్ రూంలు కట్టిస్తానని కేసీఆర్ చెప్పినందుకు కాంగ్రెస్ పార్టీకి కళ్లమంటనా అని ప్రశ్నించారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పినందుకు కంటగింపుగా మారిందా అని ప్రశ్నించారు. సభలో పాట కూడా పాడారు.
అంతకుముందు సమస్యల పైన చర్చించారని విపక్షాలు పట్టుపడుతున్న సమయంలో కేసీఆర్ మాట్లాడారు. శాసన సభను అర్ధాంతరంగా వాయిదా వేసి పారిపోయేటోళ్లం కాదన్నారు ప్రజా సమస్యల పైన క్షుణ్ణంగా చర్చించేందుకు సిద్దమన్నారు. ప్రజలకు అన్యాయం చేస్తే మిమ్మల్ని కూడా వదిలిపెట్టమని ప్రతిపక్షాలను ఉద్దేశించి అన్నారు. సమస్యల పైన చర్చించేందుకు మరో 20 రోజులు సమావేశాలు పొడిగించేందుకు సిద్ధమన్నారు.
జానారెడ్డిని కేసీఆర్ మెచ్చుకున్నారు. విమర్శలు మాని, సలహాలు ఇచ్చుకోవడం మంచిదని జానారెడ్డి అభిప్రాయపడ్డారు. దీనిపై కేసీఆర్ స్పందిస్తూ.. జానా వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నానని, గతం తవ్వుకుంటూ పోతే ఏమీ రాదని, జానా బుద్ధిమంతుడన్నారు.

రసమయి
తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభ్యుడు రసమయి బాలకిషన్ బుధవారం శాసన సభలో ఊగిపోయారు. ఎమ్మెల్యే సంపత్ దళితుల గురించి మాట్లాడుతున్నప్పుడు తెరాస సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సమయంలో రసమయి కాంగ్రెస్ పార్టీ పైన మండిపడ్డారు.

మీడియా పాయింట్
తెలంగాణ శాసన సభ సమావేశాలు గురువారానికి వాయిదా పడిన అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న రసమయి బాలకిషన్, తదితరులు.

మీడియా పాయింట్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును తాము తమ దళిత బిడ్డగా చూస్తున్నామని రమసయి బాలకిషన్ సభలో అన్నారు.

మీడియా పాయింట్
తమ దళితులకు డబుల్ బెడ్ రూంలు కట్టిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినందుకు కాంగ్రెస్ పార్టీకి కళ్లమంటనా అని రసమయి ప్రశ్నించారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పినందుకు కంటగింపుగా మారిందా అని ప్రశ్నించారు.

మీడియా పాయింట్
తెలంగాణ శాసన సభ సమావేశాలు గురువారానికి వాయిదా పడిన అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న ఎమ్మెల్యే.

మీడియా పాయింట్
తెలంగాణ శాసన సభ సమావేశాలు గురువారానికి వాయిదా పడిన అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న ఎమ్మెల్యే.

మీడియా పాయింట్
4 లక్షల 72వేలకు పైగా ఆసరా దరఖాస్తులు వచ్చాయని గతంలో చెప్పారని, ఇప్పుడు లక్షా 37వేలు వచ్చాయని ప్రభుత్వం చెబుతోందని కిషన్ రెడ్డి మండిపడ్డారు.
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మరోసారి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆసరా పథకం కోసం 4 లక్షల 72 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని గతంలో చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం, ఇప్పుడు కేవలం లక్షా 37 వేల దరఖాస్తులు మాత్రమే వచ్చాయని చెబుతోందని మండిపడ్డారు.
3 లక్షలకు పైగా దరఖాస్తులు ఏమై పోయాయని ప్రశ్నించారు. బడ్జెట్లో లెక్కలను ప్రభుత్వం మసిపూసి మారేడుకాయ చేస్తోందని ఆరోపించారు. హైదరాబాదులో ఇంటెలిజెన్స్, ఆక్టోపస్ వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, నగరాన్ని సురక్షిత ప్రాంతంగా ఎంచుకున్న ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారన్నారు.
ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలన్నారు. అన్ని రకాలుగా ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. కాగా, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. శాసనసభలో ఆర్థిక పద్దులపై చర్చ కొనసాగుతుండగా సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ప్రకటించారు.












Click it and Unblock the Notifications