రతన్ టాటా గుర్తుగా అమరావతిలో చంద్రబాబు కీలక నిర్ణయం..!
గత వారం అనారోగ్యంతో కన్నుమూసిన భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాకు గుర్తుగా అమరావతి రాజధానిలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీతో రతన్ టాటాకు ఉన్న అనుబంధాన్ని, భారత పారిశ్రామిక రంగానికి ఆయన చేసిన సేవల్ని దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు చంద్రబాబు ఇవాళ ఓ ట్వీట్ చేసారు. రతన్ టాటా ఘనమైన వారసత్వాన్ని కొనసాగించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
రతన్ టాటా యొక్క ఘనమైన వారసత్వాన్ని గుర్తుచేసుకోవడానికి అమరావతిలో 'రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్' పేరుతో ఒక ఇన్నోవేషన్ హబ్‌ను స్థాపించాలని నిర్ణయించినట్లు సీఎం చంద్రబాబు ఇవాళ ట్వీట్ చేశారు. ఈ హబ్ ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎకోసిస్టమ్, మెంటర్ స్టార్టప్‌లను ప్రోత్సహిస్తుందన్నారు. ఈ హబ్ ఐదు ఇతర జోనల్ కేంద్రాలకు అనుసంధానిస్తామని కూడా చంద్రబాబు తెలిపారు.

రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రఖ్యాత వ్యాపార గ్రూపుల మార్గదర్శకత్వంలో ప్రోత్సహించబడుతుందని, అభివృద్ధి చెందుతున్న రంగాలలో సాంకేతికత, నైపుణ్యాల మెరుగుదలని సులభతరం చేస్తుందని సీఎం చంద్రబాబు తన ట్వీట్ లో తెలిపారు. తద్వారా స్టార్టప్ ల ప్రోత్సాహం విషయంలో రతన్ టాటా చూపిన బాటలోనే సాగాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు అర్ధమవుతోంది.













Click it and Unblock the Notifications