వైరల్ వీడియో: విజయవాడ ఆస్పత్రి దారుణం- క్యాంటీన్‌లో నూడిల్స్ తింటోన్న ఎలుకలు..!!
విజయవాడ కొత్త ప్రభుత్వాసుపత్రి లోపల ఉన్న ఓ ప్రైవేట్ హోటల్ లో ఎలుకలు ప్రత్యక్షమయ్యాయి. కొన్ని ఎలుకలు అక్కడ పెట్టిన నూడిల్స్ ను ఎంచక్కా తింటూ కనిపించాయి. ఈ దృశ్యాలను అందులో చదివే ఓ పీజీ విద్యార్థి వీడియో తీసి నెట్టింట పెట్టగా.. అది కాస్తా వైరల్ గా మారింది.

విజయవాడ లోని కొత్త ప్రభుత్వాసుపత్రిలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రి హోటల్ లో పెట్టిన నూడిల్స్ ను కొన్ని ఎలుకలు తింటున్నాయి. డ్వాక్రా కింద ఆస్పత్రిలోని ఈ హోటల్ కు కేవలం టిఫిన్స్, భోజనానికి మాత్రమే అనుమతి ఉండగా నిర్వాహకులు ఫాస్ట్ ఫుడ్స్ ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి క్యాంటీన్‌లో ఎలుకల హల్చల్.. నూడుల్స్ తింటున్న వీడియో వైరల్!#Rats #GovtHospital #Vijayawada #ViralWach #Oneindia #OITelugu
— oneindiatelugu (@oneindiatelugu) December 23, 2025
విజయవాడ కొత్త ప్రభుత్వాసుపత్రి లోపల ఉన్న ఓ ప్రైవేట్ హోటల్లో ఘటన
డ్వాక్రా కింద హోటల్.. కేవలం టిఫిన్స్, భోజనానికే అనుమతి… pic.twitter.com/gYn2mx6Kh9
ఆ ఫాస్ట్ ఫుడ్ గిన్నెలోని నూడిల్స్ ను కొన్ని ఎలుకలు తినడాన్ని అందులో చదివే పీజీ విద్యార్థి వీడియో తీసి నెట్టింట అప్లోడ్ చేయగా.. అది కాస్తా వైరల్ గా మారింది. డ్వాక్రా కింద ఆ ఆస్పత్రిలో ప్రైవేట్ కు హోటల్ కు అనుమతి ఇచ్చారు. అయితే టిఫిన్స్, భోజనాలను విక్రయించేందుకు మాత్రమే హోటల్ కు అనుమతి ఉంది. అయితే హోటల్ లో నూడిల్స్ చేసేందుకు వాటిని ఉడకబెట్టి చల్లారెందుకు పక్కన ఉంచారు హోటల్ సిబ్బంది. ఇంతలో ఎలుకలు వచ్చి వాటిని తినసాగాయి. ఈ ఘటనను చూసిన పీజీ విద్యార్థి వీడియో తీసి వైరల్ చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications