కెసిఆర్ సాహసం: ఎపి మంత్రి రావెల కిశోర్ ఫైర్

హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు రాజ్యాంగాన్ని ఉల్లంఘించే సాహసం చేస్తున్నరాని ఆంధ్రప్రదేశ్ ముంత్రి రావెల కిశోర్ బాబు మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ ప్రణాళిక నిధులు దుర్వినియోగం చేసినవారిపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

ఈ బడ్జెట్‌లో వ్యవసాయ ఉపకరణాలు, విత్తనాలకు అధిక సబ్సిడీ ఇస్తామని ఆయన చెప్పారు. నెల రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి అంతా పేపర్ల మీద మీదనే ఉందని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చంద్రబాబు 24 గంటలు కష్టపడుతున్నారని చెప్పారు.

Ravela Kishore lashes out at KCR

30 రోజుల కెసిఆర్ పాలన వల్ల తెలంగాణ ప్రజలకు ముచ్చెమటలు పట్టాయని బిజెపి శాసనసభ్యుడు ప్రభాకర్ అన్నారు. అరాచక, రాక్షస పాలనకు అద్దం పడుతోందని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. పాతబస్తీ ఆక్రమణలు కెసిఆర్‌కు ఎందుకు కనిపించడం లేదని ఆయన ప్రశ్నించారు.

ప్రభుత్వాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు, అధికారులా, మంత్రులా, ఎంఎస్‌లో అని ఆయన అడిగారు. తాను, జగన్ రెండు రాష్ట్రాల్లో గెలుస్తామని కెసిఆర్ ఎందుకు చెప్పారో ఇప్పుడు అర్థమైందని ఆయన అన్నారు. వైయస్ విధానాలను కెసిఆర్ అనుసరిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. మణికొండ భూములు వక్ఫ్ భూములు కావని గతంలో నివేదిక తేల్చిందని ఆయన గుర్తు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+