తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీవారికి రూ.13.50కోట్లు విరాళంగా ఇచ్చిన ఎన్నారై భక్తులు

|
Google Oneindia TeluguNews

తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారికి ఇద్దరు ప్రవాస భారతీయులు భారీ మొత్తంలో విరాళాలు అందజేశారు. అమెరికాలో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రవి, శ్రీనివాస్‌ అనే భక్తులు శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా శ్రీవేంకటేశ్వరస్వామి వారి వివిధ ట్రస్టులకు రూ.13.50 కోట్ల విరాళాన్ని వారు సమర్పించారు. ఏపీ పరిశ్రమలశాఖ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి సమక్షంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పుట్టా సుధాకర్‌యాదవ్‌కు విరాళానికి సంబంధించిన చెక్కులను దాతలు అందజేశారు.

Ravi and Srinivas from USA donated Rs.13.5crores to TTD

టీటీడీ అధికారులు దాతలను సత్కరించి, శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఒకేసారి భారీ మొత్తంలో నగదు విరాళం ఇచ్చిన భక్తుడిగా రవి రికార్డు ఎక్కారు. రవి రూ.10కోట్లు విరాళంగా అందించగా, శ్రీనివాస్ రూ. 3.50కోట్లు విరాళంగా అందించారు.

Ravi and Srinivas from USA donated Rs.13.5crores to TTD

అమెరికాలోని ఆర్ఎక్స్ అడ్వాన్స్ ఫార్మాసూటికల్స్ కంపెనీ ఫౌండర్, సీఈఓగా రవి కొనసాగుతుండగా, జేసీజే టెక్నాలజీస్ సీఈఓగా శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారు.

English summary
AIka Ravi, Founder CEO of Rx Advance, Pharmaceutical company, Boston, USA donated Rs.10crores to TTD Hundi , while Srinivas Guthikonda, CEO of JCG technologies from USA donated Rs.3.50cr which Rs.1 crore to SV Annaprasadam Trust, Rs.1 crore to TTD BIRRD Trust, Rs.1 crore to Sarvasreya Trust, Rs.20 lakhs towards Cottage Donation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X