టిని అడ్డుకునేందుక్కాదు, అంతా అమ్మ చేతిలోనే: జెసి

అసెంబ్లీకి వచ్చే బిల్లులో రాయల తెలంగాణ ఉంటే తాము అదే కోరుతామన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన అన్ని పార్టీల నేతలు రాయల తెలంగాణకు సుముఖంగా ఉన్నారని కానీ, వారు బయటకు చెప్పలేకపోతున్నారని చెప్పారు. విభజన అంతా అమ్మ చేతిలో ఉందని.. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని ఉద్దేశించి అన్నారు.
రెండు ప్రాంతాల్లో ఔట్: నాగం
రెండు ప్రాంతాల్లో కాంగ్రెసు పార్టీ పని ఔట్ అని భారతీయ జనతా పార్టీ నేత, నాగర్ కర్నూలు శాసన సభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డి నల్గొండ జిల్లాలో అన్నారు. కాబోయే ప్రధాని నరేంద్ర మోడీయే అన్నారు. తెలంగాణ సాధనలో బిజెపి పాత్ర కీలకమని, తెలంగాణను జాప్యం చేసేందుకే రాయల తెలంగాణను తెరపైకి తీసుకు వచ్చారన్నారు.
సీమ విచ్ఛిన్నమౌతుంటే ఏం చేస్తున్నారు: బైరెడ్డి
రాయలసీమను విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు జరుగుతుంటే చంద్రబాబు, జగన్, కిరణ్ రెడ్డిలు ఏం చేస్తున్నారని రాయలసీమ పరిరక్షణ సమితి అధినేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి ప్రశ్నించారు. రాయల తెలంగాణ అంటే తెలంగాణ వెనక్కి పోయినట్లేనని, రాజ్యాంగ సవరణ అవసరమవుతుందన్నారు. రాయల టిని కోర్టుకు వెళ్లైనా అడ్డుకుంటామన్నారు. రాష్ట్ర విభజన జరిగితే సీమలోనే రాజధానిని ఏర్పాటు చేయాలన్నారు.
కుట్రపూరిత లీకులు: దేవీప్రసాద్
ప్రత్యేక తెలంగాణ విషయంలో కేంద్రం కుట్రపూరితమైన లీకులు ఇస్తోందని టిఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ ఆరోపించారు. భద్రాచలం, మునగాల తెలంగాణలోని అంతర్భాగమేనని ఆయన అన్నారు. తెలంగాణ వనరులను దోచుకోవడానికే కొంతమంది పెట్టుబడిదారులు భద్రాచలం, మునగాలపై కుట్రలు చేస్తున్నారని, సిడబ్ల్యూసి నిర్ణయం ప్రకారం సంపూర్ణ తెలంగాణ ఇవ్వకపోతే మరో యుద్ధానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. సంపూర్ణ తెలంగాణే కావాలన్నారు. డిసెంబర్ 1న ఢిల్లీలో అన్ని రాజకీయ పార్టీలను కలుస్తామన్నారు.












Click it and Unblock the Notifications