విభజన జరిగితే: హైదరాబాద్, భద్రాచలంలపై రాయపాటి

ఏఐసిసి అధ్యక్షురాలు, యుపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ చిత్ర పటానికి చిత్తూరు జిల్లా తిరుపతిలో సమాధి కట్టి, సోనియా ఘాట్‌ను ఏర్పాటు చేయడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. సమైక్యాంధ్ర కోసం తాను రాజీనామా చేశానని, దానిని ఆమోదిస్తే సంతోషమే అన్నారు.
సమైక్యమే: శైలజానాథ్
మినిస్టర్స్ క్వార్టర్సులో సీమాంధ్ర కాంగ్రెసు సమన్వయ కమిటీ గురువారం భేటీ అయింది. భేటీ అనంతరం మంత్రి శైలజానాథ్ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్ సింగ్, ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్‌లను కలుస్తామన్నారు.
విభజనపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. విభజన ప్రక్రియ అసెంబ్లీకి వస్తే వ్యతిరేకిస్తామన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని, తీర్మానం వ్యతిరేకిస్తామన్నారు. ప్రజలు కోరుకుంటున్నట్లుగా రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచేందుకు తమ వంతు పోరాటం చేస్తామన్నారు.
పురంధేశ్వరిపై మోదుగుల
విభజన విషయంలో కేంద్రమంత్రి పురంధేశ్వరి వ్యాఖ్యలపై టిడిపి ఎంపీ మోదుగుల వేణుగోపాల రెడ్డి మండిపడ్డారు. రాజ్యసభ సీటుకు కక్కుర్తిపడి దగ్గుబాటి కుటుంబం సీమాంద్రుల మనోభావాలను దెబ్బతీస్తోందని, రాష్ట్రం విడిపోతే ప్రభుత్వ కార్యాలయాలకు టోల్‌ప్లేట్లు పెడతారని అన్నారు. సమైక్య రాష్ట్రం కోసం శీతాకాల సమావేశాల్లో పల్నాటి పౌరుషం చూపుతామన్నారు.
బొగ్గు కుంభకోణంపై యనమల
బొగ్గు కుంభకోణం కేసులో అధికారులను సిబిఐ వేధిస్తోందని టిడిపి నేత యనమల రామకృష్ణుడు తూర్పు గోదావరి జిల్లాలో అన్నారు. నిందితులను రక్షించేందుకు అధికారులపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పరేఖ్ ఆరోపణలు కుట్రలో భాగమే అని ఆయన అన్నారు. జగన్‌కు బెయిల్ వెనుక సోనియా, ప్రధాని హస్తం ఉందని ఆరోపించారు. రాష్ట్ర విభజన విషయంలో ఇరు ప్రాంతాల ప్రజలతో సంప్రదింపులు జరపాలన్నారు.
సమ్మె విరమణ
సీమాంధ్ర గెజిటెడ్ అధికారుల సంఘం సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించింది.












Click it and Unblock the Notifications