టీడీపీలోకి కన్నా ఎంట్రీ- రాయపాటి హెచ్చరిక: చంద్రబాబు ఫోన్..!!

కన్నా టీడీపీలో ఎంట్రీ వేళ రాయపాటి కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు స్వయంగా మాట్లాడారు.

సీనియర్ పొలిటీషియన్ కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరుతున్నారు. ఈ రోజు మధ్నాహ్నం అందుకు ముహూర్తంగా ఖరారైంది. ఇదే సమయంలో గుంటూరు జిల్లా రాజకీయాల్లో కన్నాకు వ్యతిరేకంగా ఉన్న టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేసారు. కన్నా ఎక్కడి నుంచి పోటీ చేసినా ఓడిస్తామని హెచ్చరించారు. పార్టీలో చంద్రబాబుకు మినహా కన్నా చేరిక ఎవరికీ ఇష్టం లేదని పేర్కొన్నారు. తాను ఇక చంద్రబాబు వద్దకు వెళ్లనని స్పష్టం చేసారు. కన్నా పార్టీకి అవసరమంటున్నారని..ఆయనకు ఎన్ని ఓట్లు వచ్చాయో తెలియదా అని ప్రశ్నించారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నేరుగా ఎంపీ రాయపాటికి ఫోన్ చేసారు. అన్నీ మాట్లాడుదామని చెప్పారు. కానీ, రాయపాటి మాత్రం తగ్గేది లేదంటున్నారు.

కన్నా చేరికపై పార్టీలో అంచనాలు

కన్నా చేరికపై పార్టీలో అంచనాలు

బీజేపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తన అనుచరులతో కలిసి ఈ మధ్నాహ్నం టీడీపీలో చేరుతున్నారు. కన్నాకు పార్టీలో సరైన ప్రాతినిధ్యం కల్పిస్తామని టీడీపీ అధినాయకత్వం నుంచి హామీ వచ్చింది. సుదీర్ఘ కాలం టీడీపీతో రాజకీయ పోరాటం చేసిన కన్నా ఇప్పుడ అదే పార్టీలో చేరటంతో జిల్లాలో కొత్త సమీకరణాలకు కారణమవుతోంది. కన్నాను రాజకీయంగా విభేదించిన రాయపాటి లాంటి నేతలు ఇప్పుడు టీడీపీలోకి మాజీ మంత్రి ఎంట్రీని వ్యతిరేకిస్తున్నారు. ఓపెన్ గానే కన్నా టీడీపీలో చేరిక పైన కామెంట్స్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావటమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు కన్నాను పార్టీలోకి తీసుకోవటం ద్వారా సామాజిక - ప్రాంతీయ సమీకరణాల్లో పార్టీకి కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు.

రాయపాటి కీలక వ్యాఖ్యలు

రాయపాటి కీలక వ్యాఖ్యలు

కన్నా పార్టీలో చేరుతున్న సమయంలోనే మాజీ ఎంపీ రాయపాటి సాంబశివ రావు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. కన్నాను పార్టీలో చేర్చుకోవటం తెలివి తక్కవ పని గా అభివర్ణించారు.తనను..చంద్రబాబును ఎన్నో మాటలు కన్నా అన్నారని గుర్తు చేసారు. అలాంటి వ్యక్తిని దగ్గరకు తీసుకోవటం ఏంటని ప్రశ్నించారు. కన్నా ఇప్పుడు పార్టీకి అవసరమని చెబుతున్నారని..ఆయనకు ఎన్ని ఓట్లు వస్తాయి.. తాను గుంటూరు లోక్ సభ స్థానానికి.. కన్నా పెదకూరపాడు అసెంబ్లీకి పోటీ చేసిన సమయంలో తనకే నాలుగైదు వేల ఓట్లు ఎక్కువగా వచ్చేవని చెప్పారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే పార్టీలో ఎవరు నిలబడతారని రాయపాటి వ్యాఖ్యానించార. తమకు టికెట్ ఇస్తామంటే మినహా చంద్రబాబును వెళ్లి కలిసేది లేదన్నారు.

రాయపాటికి చంద్రబాబు ఫోన్

రాయపాటికి చంద్రబాబు ఫోన్

కన్నా పార్టీలో చేరిక..రాయపాటి వ్యాఖ్యల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు జోక్యం చేసుకున్నారు. ఇదే విషయాన్ని రాయపాటి స్వయంగా వెల్లడించారు. చంద్రబాబు ఫోన్ చేసి కన్నాను పార్టీలోకి తీసుకుంటున్న విషయాన్ని వెల్లడించారని..పర్సనల్ గా తనతో మాట్లాడుతానని చెప్పారని వివరించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫోన్ చేసి కన్నా గురించి ఎటువంటి స్టేట్ మెంట్లు ఇవ్వద్దని సూచించారని చెప్పుకొచ్చారు. కన్నా పార్టీలో చేరుతున్నారని పార్టీ కార్యాలయం నుంచి తనకు ఫోన్ వచ్చిందని..తాను రావటం లేదని చెప్పానన్నారు. తాను వెళ్లనని రాయపాటి తేల్చి చెప్పారు. అటు కన్నా పార్టీలో చేరుతున్న వేళ..ఇటు రాయపాటి చేస్తున్న వ్యాఖ్యలు పార్టీలో చర్చకు కారణమవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+