వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుకు షాక్: 2019లో నర్సరావుపేట నుండి రంగారావు పోటీ?

By Narsimha
|
Google Oneindia TeluguNews

గుంటూరు:గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు 2019 ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చనే ప్రచారం సాగుతుంది. సాంబశివరాతు తనయుడు రంగారావు వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుండి బరిలోకి దిగే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. రంగారావుకు టిడిపి రాష్ట్ర కమిటీలో చోటు దక్కింది. అనతికాలంలోనే రంగారావు టిడిపి రాష్ట్ర కమిటీలో చోటు దక్కించుకొన్నారు.

2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నుండి రాయపాటి సాంబశివరావు టిడిపిలో చేరారు. 2014 వరకు రాయపాటి గుంటూరు పార్లమెంట్ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రాతినిథ్యం వహించారు.

2014 ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కాంగ్రెస్ అంగీకరించింది. అయితే ఏపీలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు, కేంద్రమంత్రులు కొందరు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించారు.

కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేస్తే రాజకీయంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని భావించిన రాయపాటి సాంబశివరావు 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నుండి టిడిపిలో చేరారు.

టిడిపి నాయకత్వం గుంటూరు పార్లమెంట్ స్థానం కాకుండా నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుండి పోటీచేసే అవకాశాన్ని రాయపాటి సాంబశివరావుకు కల్పించింది.ప్రస్తుతం రాయపాటి సాంబశివవరావు నర్సరావుపేట పార్లమెంట్ స్థానం నుండి టిడిపి తరపున ఎంపీగా కొనసాగుతున్నారు.

2019 ఎన్నికల్లో పోటీకి రాయపాటి దూరం?

2019 ఎన్నికల్లో పోటీకి రాయపాటి దూరం?

2019 ఎన్నికల్లో రాయపాటి సాంబశివరావు ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటారనే ప్రచారం సాగుతోంది. సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో ఉన్న రాయపాటి సాంబశివరావు వచ్చే ఎన్నికల్లో పోటీచేయకుండా తన వారసుడిని రంగంలోకి దించుతారనే ప్రచారం సాగుతోంది. ఈ మేరకు రాయపాటి సాంబశివరావు అన్ని ఏర్పాట్లు చేసుకొంటున్నారని పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.

రాయపాటి రంగారావు రంగప్రవేశం చేస్తారా?

రాయపాటి రంగారావు రంగప్రవేశం చేస్తారా?

2019 ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాయపాటి సాంబశివరావు తనయుడు రంగారావు ఇప్పటి నుండే అన్ని ఏర్పాట్లు చేసుకొంటున్నారు. అనతికాలంలోనే టిడిపి రాష్ట్ర కమిటీలో రంగారావుకు చోటు దక్కింది.నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీ వ్యవహరాలను రంగారావు తన భుజానవేసుకొన్నారని టిడిపి వర్గాలంటున్నాయి.

వ్యాపారాలకే పరిమితమైన రంగారావు

వ్యాపారాలకే పరిమితమైన రంగారావు

రాయపాటి సాంబశివరావు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారు. అయితే ఎప్పుడు కూడ రంగారావు రాజకీయాల్లో అంతగా చురుకుగా పాల్గొనలేదు.వ్యాపారాలు చూసూకుంటూ ఉండేవారు. అయితే ఇటీవల కాలంలో టిడిపిలో రంగారావు చురుకుగా పాల్గొంటున్నారు.పార్టీ సీనియర్‌, కొత్త నాయకులతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుంటూ ముందు కు సాగుతున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పర్యటిస్తూ స్థానిక సమస్యలు తెలుసు కుంటూ వాటి పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్‌కి నివేదిస్తూ తనదైన ముద్ర వేసుకుంటున్నారు. ఆయన శక్తి, సామర్థ్యాలను గుర్తించిన తెలుగు దేశం పార్టీ అధినాయ కత్వం ఇటీవలే రాష్ట్ర కమిటీలో కార్యదర్శి పదవిని ఇచ్చింది.

వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏర్పాట్లు

వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏర్పాట్లు


దీర్ఘకాలం సాంబశి వరావు ఎంపీగా ఉన్నప్పటికీ ఆయన తనయుడు రంగారావు గతంలో ఎప్పుడూ ఫోకస్‌ కాలేదు. బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ నాయకత్వ బాధ్యత లు నిర్వర్తించారు.

గతంలో కొన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో సభ్యుడిగా బాధ్యతలు నిర్వ హించారు. అయితే ఇంచుమించు ఏడాది నుంచి రాయపాటి తన వారసుడిగా రంగారావును రంగంలోకి దించారు.

తండ్రి ఆశీస్సులతో ఆయన నరసరావుపేట పార్లమెంట్‌ నియోజకవర్గం పార్టీ బాధ్యతలు భుజానికి ఎత్తుకున్నారు. రంగారావుకు జిల్లా వ్యాప్తంగా టీడీపీ నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో వచ్చే ఎన్నికల నాటికి నరస రావుపేట లోక్‌సభ నియోజకవర్గానికి రాయపాటి స్థానంలో రంగారావు పోటీ చేయాలన్న తలంపుతో ఉన్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి.

English summary
Rayapati Sambasiva Rao son Ranga Rao may contest in 2019 elections from Narasaraopet parliament segment.Ranga Rao got berth in TDP state committee recently.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X