సమైక్య రాష్ట్రంలో 30 సీట్లు, జగన్‌తో నష్టం: రాయపాటి

విభజన అనివార్యమైతే తమ రాజీనామాలు ఆమోదం పొందిన తర్వాత కాంగ్రెసు పార్టీలో ఉండాలా వద్దా అనే విషయంపై ఆలోచిస్తామన్నారు. కొత్త పార్టీ ఆలోచన కూడా ఉన్నట్లు చెప్పారు. అధిష్ఠానానికి కొందరు అవాస్తవాలు చెప్పడంతో, మిగతా నాయకులను పట్టించుకోకుండా విభజన నిర్ణయం తీసేసుకున్నారని, ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకుంటే కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోతుందన్నారు. తెలంగాణను పట్టించుకోకుండా ప్రజలు వదిలేసిన సమయంలో కాంగ్రెస్ విభజన నిర్ణయం తీసుకుందన్నారు.
తెలంగాణలోనే ఎక్కువ సీట్లు వస్తాయి సీమాంధ్రలో రావనుకోవటం బోగస్ అన్నారు. తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అవివేకి కాదని, ఆయన మేధావి.. అలాంటప్పుడు పార్టీని కాంగ్రెస్‌లో ఎందుకు విలీనం చేస్తారన్నారు. వాస్తవానికి టెన్ జన్‌పథ్‌ను నమ్ముకున్నోళ్లకు తీరని అన్యాయం జరిగిందని, విభజన విషయంలో తమ అభిప్రాయాలను పట్టించుకోలేదని చెప్పారు. సీమాంధ్రలో పార్టీ పటిష్టంగా ఉందని, గత పంచాయితీ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కన్నా ఎక్కువ స్థానాలను గెలిచిందన్నారు.
తక్షణం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేదంటే హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని డిమాండ్ చేశారు. వైయస్ జగన్ కూడా బయటకు వచ్చాడు కాబట్టి ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుందన్నారు. నిర్ణయం వెనక్కు తీసుకోకపోతే ఆరుగురు ఎంపీలు రాజీనామాలు ఆమోదించుకుంటామన్నారు. తాము రాజీనామాలు చేస్తున్నది కొత్త పార్టీలో చేరటానికి కాదని, సమైక్య రాష్ట్రం కోసమని స్పష్టం చేశారు. నాలుకలు కోసేస్తానన్న ఎంపీ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలను రాయపాటి తీవ్రంగా తప్పుబట్టారు. ఎపి ఎంపీలందరికీ కన్వీనర్‌గా ఉండి ఇలా వ్యాఖ్యానించటం సరైన పద్ధతేనా? అని అన్నారు.












Click it and Unblock the Notifications