ప్రత్యేక హోదాపై ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు: జగన్‌పై రాయపాటి

గుంటూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షు వైయస్ జగన్ ప్రజలను పక్కదారి పట్టించేందుకే ప్రత్యేక హోదాపై దీక్ష చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు విమర్శించారు. జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో ఢిల్లీలో దీక్ష చేయాలని సూచించారు. మాచర్లలో 250 మంది మత్స్యకారులకు రాయపాటి సైకిళ్లు, వలలు పంపిణీ చేశారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కుట్రలను ప్రజలను నమ్మబోరని ఆంధ్రప్రదేశ్ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు ప్రభుత్వ ప్రణాళికలతో వైయస్ జగన్ బెంబేలెత్తుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఉనికిని కాపాడుకునేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. దీక్షల పేరుతో జగన్ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు.

Rayapati says YS jagan is diverting special status issue

అనుకున్న సమయానికి పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేస్తామని పత్తిపాటి చెప్పారు. గడువులోగా పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని అన్నారు. వృధాగా పోతున్న గోదావరి జలాలను మళ్లించి రాయలసీమను సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టిందని ఆయన చెప్ాపరు.

ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పట్టిసీమ ప్రాజెక్టుపై ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని అన్నారు. అనుకున్న సమయానికి పట్టిసీమను పూర్తి చేసిన ఘనతను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంతు చేసుకున్నారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+