చంద్రబాబు ఓ కులాన్ని పట్టించుకోవట్లేదు, ఆ కులానికే..: రాయపాటి సంచలనం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పైన నరసారావుపేట ఎంపీ రాయపాటి సాంబశివ రావు ఆదివారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తీరుపై ఆయన మండిపడ్డారు.

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పైన నరసారావుపేట ఎంపీ రాయపాటి సాంబశివ రావు ఆదివారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తీరుపై ఆయన మండిపడ్డారు.

చంద్రబాబు కమ్మ కులాన్ని పట్టించుకోవడం లేదని రాయపాటి ఆరోపించారు. పార్టీ కోసం పనిచేసే వారిని, పార్టీనినిలబెట్టేవారిని చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆరోపించారు.

Rayapati shocking comments on CM Chandrababu Naidu

ఓట్ల కోసం, తన పదవి కోసం చంద్రబాబు ఓ కులానికి కొమ్ము కాస్తున్నాడని పరోక్షంగా మరో అగ్ర కులానికి చెందిన టీడీపీ నేతలకు ఆయన చురకలంటించారు. తాను టిడీపీలో చాలా జూనియర్‌నని, అందుకే చంద్రబాబును గట్టిగా ప్రశ్నించలేకపోతున్నానని చెప్పారు.

పార్టీలోని కమ్మ నేతలు చంద్రబాబును ప్రశ్నించే స్దితిలో లేరన్నారు. గ్రామ స్థాయిలో పార్టీ కోసం పని చేసిన క్యాడర్ చాలా నిరుత్సాహంగా ఉన్నారన్నారు. ఇది పార్టీ మనుగడకు మంచిది కాదని హెచ్చరించారు. తాను ఇక ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేయనని, తాను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+