RBI బిగ్ అలర్ట్, ఈ వారం నాలుగు రోజులు బ్యాంకులు బంద్ - ఇలా చేయండి..!!
బ్యాంకుల ఖాతాదారులకు ఆర్బీఐ బిగ్ అలర్ట్ . వరుస సెలవుల వేళ ఖాతాదారులకు కీలక సూచన అందుతోంది. ఈ వారంలో నాలుగు రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. దీంతో, ఖాతాదారు లు అందరూ ముందస్తుగానే ఇందుకు తగిన విధంగా ప్లాన్ చేసుకోవాలని ఆర్బీఐ సూచిస్తోంది. ఈ మేరకు బ్యాంకుల సెలవు జాబితాను విడుదల చేసింది. తిరిగి వచ్చే వారం నుంచి యధావిధంగా బ్యాంకుల కార్యకలాపాలు కొనసాగనున్నాయి.
బ్యాంకింగ్ సేవలు వినియోగించుకునే ఖాతాదారులకు ఆర్బీఐ కీలక సూచన చేసింది. పండుగలు, వరుస సెలవుల కారణంగా ఈవారంలో మొత్తం నాలుగు రోజుల పాటు బ్యాంకులకు సెలవుగా ఖరారు చేసింది. ఈ వారంలో రక్షాబంధన్, ఈద్-ఎ-మిలాద్ వంటి ప్రధాన పండుగల కారణం గా తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకు శాఖల కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. దీంతో, వినియోగదారులు తమకు సంబంధించి ఏవైనా అత్యవసర బ్యాంకు పనులు, ప్రత్యక్ష లావాదేవీలు ఉంటే సోమవారంలోపే(ఆగస్టు 24) పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. ఆర్బీఐ నిర్ణయం మేరకు ఈ నెల ఆగస్టు 25న మిలాద్-ఉన్-నబీ, మొదటి ఓనం సందర్భంగా ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. ఆగస్టు 26న ఈద్-ఇ-మిలాద్ కారణంగా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో సెలవు ఉంటుంది.

ఆర్బీఐ కీలక సూచనలు
అదే విధంగా ఆగస్టు 28న రక్షాబంధన్ సందర్భంగా గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ తదితర ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు. చివరగా ఆగస్టు 30న ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకింగ్ శాఖలు బంద్ అవుతాయి. కాగా.. బ్యాంకు శాఖలు మూసివేసి ఉన్నప్పటికీ, ఖాతాదారులు డిజిటల్ సేవలను యథావిధిగా ఉపయోగించుకోవచ్చని అధికారులు సూచించారు. ఆన్‌లైన్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్‌లు, UPI లావాదేవీలు, RTGS, NEFT, ATM సేవలు ఎలాంటి అంతరాయం లేకుండా 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. అయితే చెక్కుల క్లియరెన్స్, క్యాష్ డిపాజిట్లు, లోన్ కార్యకలాపాలు మాత్రం ఈ నాలుగు రోజులలో నిలిచిపోతాయి. దీంతో.. వినియోగదారులు ఈ సెలవులకు అనుగుణంగా తమ ప్రణాళికలను సిద్దం చేసుకోవాలని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications